RBI: 97.69 శాతం రూ.2,000 నోట్లు వాపసు
ABN , Publish Date - Apr 01 , 2024 | 09:27 PM
రద్దయిన రూ.2,000 నోట్లు 97.69 శాతం బ్యాంకులకు వాపసు వచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారంనాడు ప్రకటించింది. రూ.8,202 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ: రద్దయిన రూ.2,000 నోట్లు (Rs.2000 notes) 97.69 శాతం బ్యాంకులకు వాపసు వచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారంనాడు ప్రకటించింది. రూ.8,202 కోట్ల విలువైన నోట్లు మాత్రమే సర్క్యులేషన్‌లో ఉన్నట్టు తెలిపింది.
పెద్దనోట్లరద్దు (Demonitisation)లో భాగంగా రూ.2,000 నోట్లను 2023 మే 19వ తేదీన ఆర్బీఐ రద్దు చేసింది. ఆ సమయంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్ల చలామణిలో ఉన్నాయి. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, మార్చుకునేందుకు ఆర్బీఐ పలు విడతలుగా వెసులుబాటు కల్పించింది. 2024, మార్చి 29 నాటికి మార్కెట్లో చలామణిలో ఉన్న 2 వేల నోట్ల విలువ రూ.8,202 కోట్లకు గణనీయంగా తగ్గినట్టు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, రాంచీ, రాయపూర్ ఆర్బీఐ కేంద్రాల వద్ద మాత్రమే ప్రస్తుతం 2 వేల నోట్ల ఎక్స్ఛేంజ్ జరుగుతోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.