Share News

Hindu Marriage: అది తప్పనిసరి కాదు.. హిందూ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:11 PM

హిందూ వివాహంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహానికి ‘కన్యాదానం’ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం.. హిందూ వివాహానికి సప్తపది (ఏడడుగులు) మాత్రమే అవసరమని స్పష్టం చేసింది.

Hindu Marriage: అది తప్పనిసరి కాదు.. హిందూ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు

హిందూ వివాహంపై (Hindu Marriage) అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహానికి ‘కన్యాదానం’ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం.. హిందూ వివాహానికి సప్తపది (ఏడడుగులు) మాత్రమే అవసరమని స్పష్టం చేసింది. అశుతోష్ యాదవ్ (Ashutosh Yadav) అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. హైకోర్టు లక్నో బెంచ్ ఈ తీర్పునిచ్చింది. అసలు ఏమైందంటే..

ఐపీఎల్ 2024లో యశ్ ఠాకూర్ సెన్సేషనల్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి బౌలర్

అశుతోష్‌పై అతని అత్తమామలు క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ కేసుని విచారించిన అదనపు సెషన్స్ కోర్టు.. మార్చి 6వ తేదీన అశుతోష్ అత్తమామలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుని అశుతోష్ సవాల్ చేశాడు. చట్టం ప్రకారం తన పెళ్లికి కన్యాదానం వేడుక అవసరమని, అది జరగలేదని ట్రయల్ కోర్టుకు తెలిపాడు. కాబట్టి.. తన పెళ్లి చట్టబద్ధం కాదని వాదించాడు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు సాక్షుల్ని పిలిపించాలని కోరాడు. ఈ పిటిషన్‌ని ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో.. అతను హైకోర్టుని ఆశ్రయించాడు.

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు


అశుతోష్ పిటిషన్‌ని విచారించిన హైకోర్టు.. వాదోపవాదనలు విన్న తర్వాత కన్యాదానం అవసరం లేదని పేర్కొంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ని ప్రస్తావించింది. ఈ సెక్షన్ ప్రకారం.. హిందూ వివాహానికి ‘ఏడడుగులు’ తప్పనిసరి సాంప్రదాయంగా పరిగణించబడుతుందని, కన్యాదానం తప్పనిసరి కాదని తెలిపింది. కాబట్టి.. సాక్షులను పిలిపించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. అశుతోష్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

వేసవిలో ఉదయాన్నే ఈ జ్యూస్‌లు తాగితే ఎంతో శ్రేయస్కరం

కన్యాదానం సాంప్రదాయం ఏంటి?

ఈ కన్యాదానం వేడుకని వధువు కుటుంబం నిర్వహిస్తుంది. కన్యాదానికి సరైన అర్థం.. ఆడపిల్ల మార్పిడి. వివాహ సమయంలో వధువు తండ్రి ఆమె చేతిని వరుడి చేతిలో పెట్టి.. ‘‘ఇన్నాళ్లూ నా కుమార్తెను పోషించాను. ఇకపై ఆమె బాధ్యత నీదే’’ అని తండ్రి చెప్తే.. ‘‘జీవితాంతం తప్పకుండా కూతురి బాధ్యతని నెరవేరుస్తాను’’ అని వరుడు వాగ్ధానం చేస్తాడు. ఈ ఆచారాన్నే కన్యాదానం అంటారు. ఓ తండ్రి తన కుమార్తె బాధ్యతని పెళ్లికొడుకుకి అప్పగిస్తే, దాన్ని వరుడు స్వీకరించాలని సాక్షాత్తూ శ్రీకృష్ణుడే వివరించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 01:17 PM