Share News

CAA: ఆ పని చేస్తే నేనే రాజీనామా చేస్తా.. సీఎం సంచలన ప్రకటన..

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:44 PM

పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ ) దేశవ్యాప్తంగా నిరసనల సెగలు పుట్టిస్తోంది. అనేక రాష్ట్రాలు అనేక విధాలుగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి సంచలన కామెంట్లు చేశారు.

CAA: ఆ పని చేస్తే నేనే రాజీనామా చేస్తా.. సీఎం సంచలన ప్రకటన..

పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ ) దేశవ్యాప్తంగా నిరసనల సెగలు పుట్టిస్తోంది. అనేక రాష్ట్రాలు అనేక విధాలుగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి సంచలన కామెంట్లు చేశారు. ఎన్ఆర్సీకి దరఖాస్తు చేసుకోని వ్యక్తి పౌరసత్వం పొందితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం, 2019 (సీఏఏ) సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు సహా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు అధికార బీజేపీపై విమర్శలు గుప్పించాయి. ఈ పరిణామాల నడుమ అసోం అంతటా నిరసనలు చెలరేగాయి. సీఏఏ అమలైతే లక్షలాది మంది రాష్ట్రంలోకి ప్రవేశిస్తారని, తద్వారా తమ ఉనికే ప్రమాదంలో పడుతుందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

రాష్ట్రంలో తీవ్ర నిరసనలు చెలరేగడంతో సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అలా చేయకుండా నేరుగా ఏ ఒక్కరికీ పౌరసత్వం లభించినా తాను రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దరఖాస్తు చేయడానికి సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి అన్నారు. సీఏఏ అమలుకు వ్యతిరేకంగా అసోం అంతటా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలు, చట్టం ప్రతులను దహనం చేయడంతో నిరసనలు వెల్లువెత్తాయి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

డిసెంబర్ 31, 2014 వరకు భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ లో అణచివేతకు గురవుతున్న ముస్లిమేతర వలసదారులకు భారత ప్రభుత్వం పౌరసత్వాన్ని ఇవ్వనుంది. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు ఉన్నారు. ఈ జాబితాలో ముస్లింలకు చోటు కల్పించకపోవడం ప్రస్తుత ఆందోళనలకు ప్రధాన కారణం.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 05:20 PM

News Hub