25000 Teachers Fired: 25 వేల మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు.. వడ్డీతో సహా శాలరీ చెల్లించాలని ఆదేశాలు
ABN , Publish Date - Apr 22 , 2024 | 03:54 PM
పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2016లో చేపట్టిన ప్రభుత్వ ప్రయోజిత, ఎయిడెడ్ పాఠశాలల టీచర్ల నియామకాన్ని కోల్‌కతా హైకోర్టు సంచలనాత్మక రీతిలో రద్దు చేసింది. చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగాయని, మోసపూరితంగా ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించిన అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్ట్ తేల్చింది. ఈ ఆదేశాలతో ఏకంగా 25,753 మంది టీచర్ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2016లో చేపట్టిన ప్రభుత్వ ప్రయోజిత, ఎయిడెడ్ పాఠశాలల టీచర్ల నియామకాన్ని కోల్‌కతా హైకోర్టు సంచలనాత్మక రీతిలో రద్దు చేసింది. చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగాయని, మోసపూరితంగా ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించిన అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్ట్ తేల్చింది. ఈ ఆదేశాలతో ఏకంగా 25,753 మంది టీచర్ ఉద్యోగాలను కోల్పోనున్నారు. హైకోర్ట్ ఆదేశాల ప్రకారం టీచర్లంతా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు అందుకున్న జీవితాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ప్రభుత్వాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలంటూ న్యాయమూర్తులు దేబాంగ్సు బసక్, ఎండీ షబ్బర్ రషీదీలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఉపాధ్యాయుల నుంచి డబ్బులను వసూలు చేసే బాధ్యతలను జిల్లా మేజిస్ట్రేట్‌లకు హైకోర్ట్ అప్పగించింది.
అయితే వేటు పడిన మొత్తం టీచర్లలో ఒకరికి మాత్రం హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సోమదాస్ అనే వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతుండడంతో మానవతా దృక్పథంతో తన ఉద్యోగాన్ని కొనసాగించేలా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు నియామక ప్రక్రియపై తదుపరి విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని కూడా హైకోర్ట్ ఆదేశించింది. ఇక తాజాగా నియామక ప్రక్రియను మొదలుపెట్టాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్‌సీ)ని కూడా కోరింది.
Read Latest National News and Telugu News