Share News

Chennai: తమిళనాడులోనూ బీజేపీ తెలంగాణ ఫార్ములా !

ABN , Publish Date - Aug 14 , 2024 | 12:51 PM

రాష్ట్రంలోనూ ‘తెలంగాణ ఫార్ములా’ అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రతిపక్ష అన్నాడీఎంకేను తృతీయ స్థానానికి నెట్టి, తాను ద్వితీయస్థానానికి ఎగబాకాలని ఆ పార్టీ తలపోస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే నుంచే వ్యూహరచన చేయాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి ఆ పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Chennai: తమిళనాడులోనూ బీజేపీ తెలంగాణ ఫార్ములా !

- అన్నాడీఎంకేని తృతీయ స్థానానికి కూల్చడం

- నెంబరు 2కు వెళ్లడమే లక్ష్యం

- అన్నామలైకి అమిత్‌షా దిశానిర్దేశం

చెన్నై: రాష్ట్రంలోనూ ‘తెలంగాణ ఫార్ములా’ అమలు చేయాలని బీజేపీ(BJP) భావిస్తోంది. ఇందుకోసం ప్రతిపక్ష అన్నాడీఎంకేను తృతీయ స్థానానికి నెట్టి, తాను ద్వితీయస్థానానికి ఎగబాకాలని ఆ పార్టీ తలపోస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే నుంచే వ్యూహరచన చేయాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఆ పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక రాజీనామా డిమాండ్లు, తొలగింపులను పక్కనబెట్టి భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఆ పార్టీ నేతలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదికూడా చదవండి: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్..


గత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఒక్కస్థానం కూడా గెలవలేకపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై ఆ పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని పలువురు సీనియర్లు డిమాండ్‌ చేస్తుండగా, మరికొంతమంది అధిష్టానంతో మాట్లాడి తమ ‘ఆలోచన’లకు పదునుపెట్టారు. దీంతో ఏ క్షణంలోనైనా అన్నామలైని తొలగించనున్నారని విస్త్రత ప్రచారం జరిగింది. దీనికి తోడు రాజకీయ సదస్సు కోసం కొంతకాలం లండన్‌ వెళ్లనున్న అన్నామలై కూడా తన పదవి నుంచి వైదొలగాలని భావించినట్లు తెలిసింది. వీటన్నింటిని నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి నూతన సారధి రావడం ఖాయమని అన్నివర్గాలు భావించాయి. అయితే అన్నామలైని ఢిల్లీకి పిలిచిన కమలనాధులు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అన్నామలైని పిలిచిపంచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత అమిత్‌షా ఇందుకు సంబంధించిన వ్యూహరచన విశదీకరించినట్టు సమాచారం.

యి.


గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న బీజేపీ(BJP) నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నవిషయం తెలిసిందే. అయితే గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఒక్కస్థానాన్ని కూడా సాధించుకోలేకపోయింది. అయితే ఆ కూటమికి 18 శాతం ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 14 శాతం ఓట్లతో సంతృప్తి చెందిన బీజేపీ.. గత మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించి, బీఆర్‌ఎ్‌స ను తృతీయస్థానంలోకి నెట్టింది. అలాంటప్పుడు తమిళనాడులోనూ అలా ఎదిగేందుకు అవకాశముందని, ఆ ఫలితాల కోసం తామెందుకు ప్రయత్నించకూడదని అమిత్‌షా, జేపీ నడ్డా అన్నామలైకి వివరించినట్లు తెలిసింది.

nani1.2.jpg


కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను తెలంగాణ నేతలు గట్టిగా నిలదీశారని, అంతేగాక ప్రజా సమస్యలపై గట్టి పోరాటం సల్పారని వివరించిన అగ్రనేతలు.. తమిళనాడులోనూ ఆ విధానాలను అనుసరించాలని స్పష్టం చేశారు. అధికార డీఎంకేను ఇప్పటికిప్పుడు కుప్పకూల్చడం అయ్యేపని కానందున.. ద్వితీయ స్థానంలో వున్న అన్నాడీఎంను బలహీనపర్చడం, ఆ పార్టీని తృతీయ స్థానానికి నెట్టడం ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు.


గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 20 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. దక్షిణ జిల్లాలు, కొంగుమండలంలో అయితే ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. అందువల్ల 2026 ఎన్నికల్లో అన్నాడీఎంకే(AIADMK) కూటమిలో వున్న డీఎండీకే, పుదియతమిళగం వంటి పార్టీలను తమ దరిచేర్చుకుంటే, ఆ పార్టీ బలహీనపడుతుందని, అదే సమయంలో ఆయా పార్టీలను తమ కూటమిలో చేర్చుకుంటే తమ ఓటుబ్యాంకు 30 శాతానికి పెరిగే అవకాశముందని, అప్పుడు తాము ఆశించిన ఫలితాలు అందుకోవడం పెద్ద సమస్య కాబోదని వారు పేర్కొన్నట్లు తెలిసింది.


ముందుగా తెలంగాణ బీజేపీ నేతలతో మాట్లాడి, ప్రజా సమస్యలపై మరింత అవగాహన పెంచుకోవాలని, ఇందుకు అవసరమైతే ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. తెలంగాణ వ్యూహాన్నే రాష్ట్రంలోనూ అమలు చేయాలని, అది సత్ఫలితాలను ఇస్తుందని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీని గురించి అన్నామలై ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ అగ్రనేతల ఈ నిర్ణయంతో పార్టీ బలోపేతానికి వ్యూహరచనతో పాటు అన్నామలై తొలగింపు ఇప్పట్లో ఉండబోదని కూడా పార్టీ క్యాడర్‌కు స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. తద్వారా అన్నామలై తొలగింపుపై రేగుతున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లే నని రాజకీయ వర్గాలు భావిస్తున్నా


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2024 | 12:51 PM