Share News

Chennai: నేడు అల్పపీడనం.. పలుచోట్ల వర్షాలు కురిసే అవకావం

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:31 PM

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు కురవనున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

Chennai: నేడు అల్పపీడనం.. పలుచోట్ల వర్షాలు కురిసే అవకావం

చెన్నై: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు కురవనున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Agra: వ్యభిచారం కేసులో కూతురి అరెస్టు అంటూ ఫోన్.. గుండెపోటుతో తల్లి మృతి


ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోను, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలోని రామనాథపురం, శివగంగ, పుదుకోట, తంజావూరు(Ramanathapuram, Sivaganga, Pudukota, Thanjavur), తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. నగరానికి సంబంధించినంత వరకూ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


కార్పొరేషన్‌లో 36 పడవలు సిద్ధం...

ఈశాన్య రుతుపవన ప్రభావంతో ఈ నెల మొదటి వారం నుంచి వర్షాలు తీవ్రరూపం దాల్చనున్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించడంతో నగరంలో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చెన్నై కార్పొరేషన్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు వరదనీటిలో చిక్కుకునేవారిని కాపాడేందుకుగాను 36 పడవలను కొనుగోలు చేసింది. స్థానిక జాలర్ల నుంచి మరో 80 పడవలను తెప్పించింది. గురువారం రెండు పడవలను మాధవరం, పెరుంగుడి ప్రాంతాలకు లారీల్లో తరలించారు.

nani2.2.jpg


ఇక వరద బాధితులు, వర్షబాధితులకు తాత్కలిక బస కల్పించేందుకు సహాయక శిబిరాలు, తాగునీటి ట్యాంకర్లు, జనరేటర్లు, వంటగదులను కూడా సిద్ధం చేసి ఉంచారు. నగరంలో వర్షపునీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు భారీ పంపుసెట్లను కూడా జోనల్‌ కార్యాలయాలకు తరలిస్తున్నారు. ఇక వర్షబాధితులు, వరదబాధితులకు సహాయక చర్యలు చేపట్టేందుకు కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బందితో కలిసి సేవలందించాలనుకునే స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు, కార్యకర్తలు https://gccservices. chennaicorporation.gov.in/volunteer అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.


.................................................................

ఈ వార్తను కూడా చదవండి:

................................................................

Chennai: వామ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. రైలు పట్టాలో పగుళ్లు

- తప్పిన ప్రమాదం

- రైళ్ల రాకపోకలకు అంతరాయం

చెన్నై: రాణీపేట జిల్లా అరక్కోణం(Arakkonam) సమీపంలోని పులియమంగళం వద్ద రైలు పట్టాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. గురువారం ఉదయం దీనిని రైల్వే ఉద్యోగి గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలిలా వున్నాయి... ఉదయం 8.50 గంటల ప్రాంతంలో తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ పులియమంగళం వైపు వచ్చింది. అదే సమయంలో రైలు పట్టాల్లో పగుళ్లు ఏర్పడివుండం గమనించిన రైల్వే ఉద్యోగి(Railway employee) ఎర్ర జెండా చూపుతూ రైలు ఆపేందుకు ప్రయత్నించారు.

nani1.jpg


చివరి క్షణంలో గమనించిన లోకోపైలట్‌ రైలు ఆపేందుకు ప్రయత్నించినా రైలు ఇంజన్‌, రిజర్వేషన్‌ బోగి, ఏసీ బోగీలు పెద్ద శబ్దంతో ఆ పగుళ్లు దాటి వెళ్లాయి. భారీ శబ్దం రావడంతో ఎస్‌-1లో వున్న ప్రయాణీకులు చైన్‌ లాగారు. దీంతో రైలు ఆగింది. రైలు ఆగాక డ్రైవర్‌, గార్డ్‌ వెళ్లి తనిఖీ చేయగా పట్టాలపై పగుళ్లు కనిపించాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రైలు అక్కడే నిలిపేశారు. అరక్కోణం, పెరంబూరు నుంచి వచ్చిన సిబ్బంది. పగుళ్లను సరి చేసిన తరువాత నిధానంగా రైలు బయలుదేరింది. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకల్లో జాప్యం ఏర్పడింది.


ఇదికూడా చదవండి: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

ఇదికూడా చదవండి: మంత్రి సురేఖ‌ వ్యాఖ్య‌లు.. ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏమ‌న్నారంటే

ఇదికూడా చదవండి: సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !

ఇదికూడా చదవండి: Etela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2024 | 12:31 PM