Share News

Mumbai: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. 28 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి.. ఎందుకంటే

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:10 PM

బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది.

Mumbai: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. 28 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి.. ఎందుకంటే

ముంబై: బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది.

BJP: ప్రవాసీయుల మద్దతు కోసం బీజేపీ వినూత్న ప్రచారం.. 'NRI4NAMO' కార్యక్రమం ప్రారంభం

అయితే పెళ్లైన కొన్నాళ్లకు గర్భం దాల్చిన బాలిక.. 28 వారాలపాటు అలాగే గడిపింది. ఈ క్రమంలో మెడికల్ చెకప్‌ చేసుకున్న ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది.


ఆమె కడుపులో పెరుగుతున్న పిండానికి జన్యుపరమైన సమస్యలు ఉన్నట్లు స్కానింగ్‌లో తేలింది. దీంతో గర్భవిచ్ఛిత్తి కోరుతూ ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

న్యాయమూర్తులు పీడీ నాయక్, ఎన్ఆర్ బోర్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఏప్రిల్ 12న ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది. కోర్టు విడుదల చేసిన ఆర్డర్ కాపీలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సదరు ఆర్డర్ కాపీ గురువారం అందుబాటులోకి వచ్చింది.


బాలిక HIV సెరోపోజిటివ్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతోపాటు పిండానికి సమస్యలు ఉండటంతో బాలిక గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం.. 24 వారాలుపైబడిన గర్భాన్ని తొలగించుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి.

బాలిక మైనర్ కావడం, "HIV సెరోపోజిటివ్ స్టేటస్"తో బాల్య వివాహ బాధితురాలు అయినందున గర్భాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్ మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ప్రకారం హైకోర్టు విచారణ జరిగింది. బోర్డు తన నివేదికలో పిండంలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. బాలిక మానసిక, వైద్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని గర్భాన్ని తొలగించేందుకు అనుమతిస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెలువరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 08:10 PM