Share News

అభివృద్ధి పనులపై జీఎస్టీ పిడుగు

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:30 AM

చీమకుర్తి మండలంలో మండల పరిషత్‌ నిధులతో అభి వృద్ధి పనులు చేసినవారిపై జీఎస్టీ పిడుగు ప డనుంది.

 అభివృద్ధి పనులపై జీఎస్టీ పిడుగు

గత మూడేళ్లలో పనులు చేసిన వారి వివరాల సేకరణ

త్వరలో నోటీసులు పంపనున్న కమర్షియల్‌ టాక్స్‌ అధికారులు

చీమకుర్తి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): చీమకుర్తి మండలంలో మండల పరిషత్‌ నిధులతో అభి వృద్ధి పనులు చేసినవారిపై జీఎస్టీ పిడుగు ప డనుంది. గత మూడేళ్లలో పనులు చేసిన వారి వివరాలను తమకు అందజేయాలని కమర్షి యల్‌ ట్యాక్స్‌ అధికారులు ఎంపీడీవోకు అధికా రికంగా లెటర్‌ ఇవ్వటంతో పాటు ఒక అధికారి ప్రత్యేకంగా మండల కార్యాలయానికి విచ్చేసి వివరాలను త్వరగా అందజేయాలని కోరటం గ మనార్హం. ఈ విషయం తెలుసుకున్న వర్క్‌లు చేసిన వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. గ త మూడేళ్లలో కూటమి ప్రభుత్వం రాకముం దు వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 22కోట్ల వివిధ రకాల పనులను గ్రామాలలో ని ర్వహించారు. మండలపరిషత్‌ పగ్గాలు వైసీపీ చేతిలో ఉండటంతో పనులన్నీ ఆ పార్టీ నాయ కులే నిర్వహించారు. అయితే పనులు నిర్వ హించిన వారిలో జీఎస్టీ నంబర్‌ కల్గిన వారికి పెద్దగా ఇబ్బంది లేదు. వారు ఎప్పటికపుడు జీఎస్టీ వివరాలను వాణిజ్య పన్నులశాఖకు అ ప్‌డేట్‌ చేస్తుంటారు. కానీ ఎక్కువ మంది జీఎస్టీ ఖాతాలు లేనివారే నామినేషన్‌ పద్ధతిలో గ్రామాల్లో పనులు నిర్వహించారు. ఇపుడు వా రందరూ నోటీసులు అందుకోనున్నారు. 18శా తం చొప్పున దీనికి అదనంగా వడ్డీతో సహ జీ ఎస్టీ రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుం ది. అంటే రూ.5లక్షలు వర్క్‌ చేస్తే దాదాపు రూ.90వేలను చెల్లించాల్సి ఉంటుంది. ఎపుడో చేసిన పనులకు ఇపుడు అదనంగా డబ్బులు చెల్లించాల్సి రావటం పట్ల పనులు చేసినవారికి పాలుపోవటం లేదు. నోటీసులు అందితే దాని ని బట్టి ఏమి చేయాలో డిసైడ్‌ అవుదాములే అని వైసీపీ అధిష్ఠానం తమ నాయకులను ఊ రడిస్తుంది. కాగా దీని ఎఫెక్ట్‌ కొత్తగా నిర్వ హించబోయే పనులపై కూడా పడుతుంది. మ ండల నిధులతో పనులు నిర్వహించటానికి పనుల వివరాలు అందచేస్తే వర్క్‌ ఆర్డర్స్‌ ఇస్తా మని వైసీపీ నాయకులు చెబుతున్నా గ్రామా ల్లో వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముందు కురావటానికి జంకుతున్నారు. 18శాతం జీఎ స్టీ చెల్లిస్తే తమకు మిగిలేదేముంది అని వెనుకా డుతున్నారు. దీంతో మండల ఖాతాలో ఉన్న రూ.21కోట్లతో అభివృద్ధి పనులు నిర్వ హించ డానికి ఇరువర్గాల మధ్య సఖ్యత కుదిరి నా జీ ఎస్టీ వ్యవహరంతో ముందుకు సాగటం లేదు.

Updated Date - Apr 02 , 2025 | 12:30 AM