ప..రేషన్!
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:35 AM
కొత్త రేషన్‌కార్డులకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రక్రియ ఆరంభిస్తుందా.. ఎప్పుడు దరఖాస్తు చేసు కుందామా అని నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంకా ప్రక్రియ ప్రారంభించ కపోవడంతో నిరాశ చెందారు.

వైసీపీలో మూడేళ్లూ ఆ ఊసేలేదు
ప్రస్తుత ప్రభుత్వంలోనూ జాప్యం
అర్హులైన పేదల ఆందోళన
ఉమ్మడి జిల్లాలో కార్డులకు క్యూ
మే నెలలో ఇచ్చేందుకు ప్రణాళిక
ఇప్పటికే 16.20 లక్షలు
మరో 3 లక్షల దరఖాస్తులు
తాజాగా కార్డులకు ఈకేవైసీ
నెలాఖరు వరకూ గడువు పెంపు
సామర్లకోట, ఏప్రిల్1 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌కార్డులకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రక్రియ ఆరంభిస్తుందా.. ఎప్పుడు దరఖాస్తు చేసు కుందామా అని నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంకా ప్రక్రియ ప్రారంభించ కపోవడంతో నిరాశ చెందారు. తొలుత సంక్రాంతికి కొత్త కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసు కున్న ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసే ఎత్త లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 16.20 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నా యి. కొత్త కార్డులు జారీ చేస్తే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మంత్రి నాదెండ్ల మేలో కొత్త కార్డులు జారీ చేస్తామని చెప్పడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో నాలుగేళ్లుగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు కావడం లేదు. నాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు రేషన్‌కార్డుల పేరిట బియ్యం కార్డులు మంజూరు చేసింది. తర్వాత మూడేళ్లలో ఒక్క కార్డూ ఇవ్వలేదు. వైసీపీ హయాంలో దరఖాస్తు చేసుకున్న చాలామంది అర్హులకు కార్డులు రాలేదు. ఆ పార్టీ మద్దతుదా రులకు అధికంగా కార్డులు జారీ చేశారన్న విమ ర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే అర్హులు అందరికీ కొత్త కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. మొన్న సంక్రాంతికి కార్డులు ఇస్తామని పేర్కొం ది. జిల్లా పౌరసరఫరాల అధికారులు కొత్తకార్డు లు ఇస్తామని గత డిసెంబరులో ప్రకటించారు. డిసెంబరు 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీక రణ చేపడతామని, కొత్త రేషన్‌కార్డులే కాదు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కానీ ఆ తర్వాత అది పురోగతి లేకుండా పోయింది.
ప్రభుత్వ పథకాలకు ప్రామాణికం
ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులనే ప్రామా ణికంగా తీసుకుంటుండడంతో కొత్తకార్డులు కా వాలని కోరుతూ జిల్లా, మండల స్థాయిలో నిర్వ హించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజ లు పెద్దఎత్తున అర్జీలు సమర్పిస్తున్నారు. మూ డేళ్లుగా రేషన్‌కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు అనేక మం ది అటు తహశీల్దార్ కార్యాలయాలు, ఇటు పౌర సరఫరాల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగు తున్నారు. కుటుంబంలో ఎవరో ఒకరు చని పోయి ఉంటే వారి తొలగింపు పుట్టిన వారి పేర్ల చేర్పు, కుటుంబంలో ఐదారుగురు గతంలో కలి సి ఉండి ఇప్పుడు విడిగా ఉన్నవారు కొత్తకార్డు కు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల పౌరసరఫ రాలశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో కొత్త రేషన్ కార్డులతోపాటు చేర్పులు, మార్పుల కోసం వస్తున్న అర్జీలు విషయాన్ని జిల్లా అధికారులు ప్రస్తావించారు.
మే నెల నుంచి కొత్తకార్డులు?
ఏటీఎం తరహాలో.. మంత్రి ప్రకటన..
ప్రస్తుతం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. రేషన్‌కార్డుల రేషనలైజేషన్ ప్రక్రియ గతంలోనే పూర్తయిం ది. 800కు మించి కార్డులున్న రేషన్ షాపు లను అధికారులు గుర్తించారు. కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు కార్డుల విభజన ప్రక్రియ చేశారు. గ్రామాల్లో ఒక్కొక్క చౌక దుకాణా నికి 400 నుంచి 450 కార్డులు ఉండాలని, మునిసిపాలిటీల పరిధిలో 500 నుంచి 550 కార్డులు ఉండాలని, కార్పొరేషన్ పరిధిలో 600 నుంచి 650 కార్డులు ఉండాలని అధి కారులు నిర్ణయించారు. కానీ దీనిపై డీలర్లు కోర్టును ఆశ్రయించి తమకు ఒక్కొక్కరికి 1000 రేషన్‌కార్డులు ఉంటేనే జీవనం సాగిం చగలమని తెలిపారు. దీంతో కొత్త కార్డుల జారీకి బ్రేక్ పడింది. కోర్టు వ్యవహారం ఇటీ వల ముగిసింది. చనిపోయిన వారి కార్డులు తొలగించిన తర్వాత కార్డుల విభజన చేప ట్టాలని న్యాయ స్థానం సూచించినట్టు సమా చారం. ఈ క్రమంలో ఈకేవైసీ పూర్తయిన వెంటనే కొత్త కార్డుల జారీ మొదలుకానుం దని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుత రేషన్‌కార్డు సైజు తగ్గించి ఏటీఎం కార్డు తరహాలో మే నెల నుంచి ఇవ్వనున్న ట్టు చెప్పారు. ఆ సమయంలోనే కుటుంబ స భ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని, క్యూఆర్ కోడ్‌తో కొత్త కార్డులు ఇస్తామన్నారు. అయితే కొత్త కార్డులు ఈసారైనా ఇస్తారో లేదో చూడాలి.