Share News

Delhi Assembly Elections: సిసోడియా సీటు మార్పు, 13 సిట్టింగ్‌లకు దక్కని చోటు

ABN , Publish Date - Dec 09 , 2024 | 02:45 PM

ప్రతాప్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్న సోసిడియా ఈసారి జంగ్‌పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రతాప్‌గంజ్ నియోజకవర్గాన్ని ఇటీవలే పార్టీలో చేరిన విద్యావేత్త, పాపులర్ యూట్యూబర్ అవథ్ ఓఝాకు కేటాయించారు.

Delhi Assembly Elections: సిసోడియా సీటు మార్పు, 13 సిట్టింగ్‌లకు దక్కని చోటు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections) ముందుగానే కసరత్తు ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను సోమవారంనాడు విడుదల చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) సీటును ఈసారి మార్పు చేసింది. ప్రతాప్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్న సోసిడియా ఈసారి జంగ్‌పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రతాప్‌గంజ్ నియోజకవర్గాన్ని ఇటీవలే పార్టీలో చేరిన విద్యావేత్త, పాపులర్ యూట్యూబర్ అవథ్ ఓఝాకు కేటాయించారు. పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో జితేందర్ సింగ్ షుంటి (షాదరా నుంచి), సురిందర్ పాల్ సింగ్ బిట్టు (తిమర్‌పూర్) పేర్లు చోటుచేసుకున్నాయి. బిట్టు ఇటీవలే బీజేపీ నుంచి ఆప్‌లో చేరారు.

Parliament Winter Session: కొనసాగుతోన్న వాయిదాల పర్వం.. మూడు కీలక బిల్లుల ఆమోదం!


ఎస్‌కే బగ్గా కుమారుడు వికాస్ బగ్గాకు కృష్ణానగర్ నుంచి టిక్కెట్ లభించగా, ప్రహ్లాద్ సింగ్ సాహ్నే కుమారుడు పునర్‌దీప్ సింగ్ సాహ్నే నుంచి చౌంద్నీ చౌక్ టిక్కెట్ ఇచ్చారు. పటేల్ నగర్ నుంచి పర్వేష్ రతన్‌ను ఆప్ బరిలోకి దింపిది. పటేల్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇటీవల ఆప్‌ను వీడి బీజేపీలో చేరారు. గాంధీనగర్ నుంచి నవీన్ చౌదరి, రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దీపు చౌదరికి గాంధీనగర్ టిక్కెట్ లభించింది. రాఖి బిద్లాన్‌కు మదిపూర్, ప్రవీణ్‌ కుమార్‌కు జానక్‌పురి టిక్కెట్ లభించింది. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రెండో జాబితాలో చోటు దక్కలేదు. వారిలో శరద్ చౌహాన్, దిలీప్ పాండే, పవన్ శర్మ, ధర్మపాల్ లక్ర, ప్రహ్లాద్ సింగ్ సాహ్నే, గిరీష్ సోని, రాజేష్ రిషి, భూపిందర్ సింగ్ జూన్, భావనా గౌర్, ప్రకాష్ జార్వాల్, రోహిత్ కుమార్ మెహ్రౌలియా, ఎస్‌కే బగ్గా, హాజి యూనుస్ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది అభ్యర్థులతో ఇటీవల తొలి జాబితాను విడుదల చేసింది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి 2025 ఫిబ్రవరికి ముందే ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.


కేజ్రీవాల్‌కు సిసోడియా కృతజ్ఞతలు

కాగా, తనపై నమ్మకం ఉంచి జంగ్‌పుర నియోజకవర్గం నుంచి పోటీచేసే బాధ్యత అప్పగించిన పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సిసోడియా కృతజ్ఞతలు తెలిపారు. తనను తాను ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక టీచర్‌గానే భావిస్తుంటానని, ప్రతాప్ గంజ్ తనకు కేవలం అసెంబ్లీ నియోజకవర్గమే కాదని, ఢిల్లీలో విద్యా విప్లవానికి గుండెకాయ వంటిదని చెప్పారు. అవథ్ జోఝా పార్టీలోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్ రావడంతో ఒక టీచర్‌కు ప్రతాప్‌గంజ్‌కు మించిన మంచి నియోజకవర్గం ఉండదని తాను భావించినట్టు ఆయన చెప్పారు.


ఇవి కూడా చదవండి..

పాక్‌కు బంగ్లా మరింత చేరువ!

Vikram Misri: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి

For National News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 02:45 PM