Share News

Deputy CM: గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలి..

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:56 PM

సమైక్యతకు భంగం కలిగించేలా, తమిళ తాయి గేయంలో కొన్ని పంక్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కోట్లాది తమిళ ప్రజల మనస్సులను గాయపరిచిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌.రవిని తక్షణం రీకాల్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) డిమాండ్‌ చేశారు.

Deputy CM: గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలి..

- డిప్యూటీ సీఎం ఉదయనిధి

చెన్నై: సమైక్యతకు భంగం కలిగించేలా, తమిళ తాయి గేయంలో కొన్ని పంక్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కోట్లాది తమిళ ప్రజల మనస్సులను గాయపరిచిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌.రవిని తక్షణం రీకాల్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ ఖాతాలో శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘తమిళ తాయ్‌’ గేయం రూపకల్పన సమయంలో కొన్ని పంక్తులు కొన్ని వర్గాల ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా ఉన్నాయని గుర్తించిన దివంత కలైంజర్‌ కరుణానిధి.. వాటిని తొలగించారు. కానీ, డీడీ తమిళ్‌(DD Tamil) ఆధ్వర్యంలో జరిగిన హిందీ మాసోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌... తమిళ తాయి గేయంలో ఏకంగా ‘ద్రావిడ నల్‌తిరునాడు’ అనే పదాలనే తొలగించి ఆలపించారు.

ఈ వార్తను కూడా చదవండి: రైల్వేలో రిటైర్‌ అయిన వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు


nani1.2.jpg

ఏ ఒక్కరినీ మనోభావాలను గాయపరచరాదన్నది ద్రవిడం. ఇతరుల మనసులను గాయపరచి సంతోషపడటం ఆర్య సంస్కృతి. దీనికి ఓ మంచి ఉదాహరణే గవర్నర్‌ చర్య. దువ్వెన దాచిపెట్టినంత మాత్రాన వివాహం ఆగిపోదు. కొన్ని పంక్తులను తొలగించడం వల్ల ద్రావిడం పడిపోదు. ఆర్యులు దీన్ని అర్థం చేసుకోలేరు. అన్నా మార్గంలో పయనిస్తున్న మన నేత ఎంకే స్టాలిన్‌(MK Stalin)కు గౌరవ మర్యాదలు, పరువు గురించి ఇతరులు పాఠం చెప్పాల్సిన పనిలేదు. సమైక్యతకు విచ్ఛిన్నం కలిగించేలా నడుచుకుంటున్న గవర్నర్‌ను తక్షణం కేంద్రం రీకాల్‌ చేయాలి’ అని ఉదయనిధిస్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.


ఇదికూడా చదవండి: Group-1: గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

ఇదికూడా చదవండి: గద్దర్‌పై మహా పరిశోధన

ఇదికూడా చదవండి: Kishan Reddy: ముందు మూసీకి రిటైనింగ్‌ వాల్‌ కట్టండి

ఇదికూడా చదవండి: Train Schedule: ఆ రైళ్ల వేళలు మారాయ్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2024 | 12:56 PM