Share News

Gali Janardhan Reddy: పోలీసుల అదుపులో ‘గాలి’ కారు!

ABN , Publish Date - Oct 09 , 2024 | 12:38 PM

మూడు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) గంగావతి నుంచి బళ్ళారికి వచ్చే సమయంలో ఆయన కాన్వాయ్‌కు వ్యతిరేకదిశలో వాహనాన్ని నడిపినందుకు గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి(Gangavati MLA Gali Janardhan Reddy) కారును గంగావతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Gali Janardhan Reddy: పోలీసుల అదుపులో ‘గాలి’ కారు!

- ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘనపై కేసు నమోదు

బళ్లారి(బెంగళూరు): మూడు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) గంగావతి నుంచి బళ్ళారికి వచ్చే సమయంలో ఆయన కాన్వాయ్‌కు వ్యతిరేకదిశలో వాహనాన్ని నడిపినందుకు గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి(Gangavati MLA Gali Janardhan Reddy) కారును గంగావతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వెళుతున్న దారిలో జీరో ట్రాఫిక్‌ నిమయాలను ఉల్లంఘించి నేరుగా జనార్దన్‌ రెడ్డి కారు నడుపుతూ పుట్‌పాత్‌ను దాటి ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న రోడ్డుపైకి రావడంపై కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేర్లు నమోదు చేయలేదు. నియమాలు ఉల్లంఘించిన వాహనాలను మాత్రమే గంగావతి ట్రాఫిక్‌ పోలీసులు తీసుకొచ్చి పంచనామా చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..


nani2.jpg

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషియల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనిపై స్పందించిన గాలి జనార్దన్‌ రెడ్డి బళ్ళారి(Ballari)లో ఏర్పాటు చేసిన హోమంలో పాల్గొనడానికి త్వరగా వెళ్లాల్సి రావడంతో ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. అయినా అప్పటికే అరగంటకు పైగా ట్రాఫిక్‌లో వేచిచూడాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎవరూ ప్రజలను ఇబ్బంది పెట్టరాదని సమర్థించుకున్నారు. అత్యవసరంగా పూజా కార్యక్రమానికి వెళ్లాల్సిన కారణంగా రోడ్డు డివైడర్‌ దాటానేగాని మరే దురేద్దేశం లేదని, మాధ్యమాలు దీనిని తప్పగా భావించినట్లు తెలిపారు.


.............................................................

ఈ వార్తను కూడా చదవండి:

...............................................................

Chennai: వామ్మో.. కత్తితో ఆస్పత్రికి వచ్చిన యువకుడు..

- భయంతో పరుగులు తీసిన నర్సులు

చెన్నై: శివగంగ జిల్లా కారైక్కుడిలో ఆస్తి తగాదా కారణంగా తమ్ముడి చేతుల్లో కత్తిపోట్లకు గురైన అన్న గాయాలతోనే కత్తిపట్టుకుని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళాడు. రక్తం కారుతూ పట్టా కత్తితో వస్తున్న అతడిని చూసి నర్సులు, వైద్య సిబ్బంది పరుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని విచారణ జరిపారు. పోలీసుల సమాచారం మేరకు కారైక్కుడి సమీపం ముత్తుపట్టినం ప్రాంతంలో శివపాండ్యన్‌, బృహదీశ్వరన్‌(Sivapandyan, Brihadeeswaran) అనే అన్నదమ్ములు వేర్వేరుగా నివశిస్తున్నారు.

nani1.2.jpg


వారిద్దరూ తరచూ ఆస్తి కోసం గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి శివపాండ్యన్‌ ఇంటికి వెళ్లి ఆస్తి విషయమై బృహదీశ్వరన్‌ తగాదాపెట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన బృహదీశ్వరన్‌ కత్తితో శివపాండ్యన్‌పై దాడి చేశాడు. దీంతో శివపాండ్యన్‌ తలకు, మెడకు, చేతికి గాయాలయ్యాయి. ఈ దాడి చేసిన బృహదీశ్వరన్‌ కత్తిని అక్కడే పడేసి పారిపోయాడు. ఆ తర్వాత శివపాండ్యన్‌ వళ్లంతా రక్తం కారుతుండగా కత్తిని పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళాడు.

nani1.jpg


ఇదికూడా చదవండి: Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం

ఇదికూడా చదవండి: Mulugu: కాటేసిన పాము, కరెంటు!

ఇదికూడా చదవండి: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌

ఇదికూడా చదవండి: Investment Scam: స్టాక్‌ బ్రోకింగ్‌ పేరుతో.. ఘరానా మోసం!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2024 | 12:38 PM