Share News

Saraswati: చీర లేకుండా సరస్వతీ దేవి విగ్రహం.. భగ్గుమన్న ఏబీవీపీ, భజరంగ్ దళ్

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:11 AM

వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని హిందువులు నిష్టగా కొలుస్తారు. త్రిపుర ఆర్డ్ అండ్ క్రాప్ట్ కాలేజీలో సరస్వతీ దేవిని అవమానించారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మండిపడింది.

Saraswati: చీర లేకుండా సరస్వతీ దేవి విగ్రహం.. భగ్గుమన్న ఏబీవీపీ, భజరంగ్ దళ్

అగర్తలా: విద్యాబుద్దులు ప్రసాదించే అమ్మవారు సరస్వతీ దేవి. హిందువులు అమ్మ వారిని నిత్యం పూజిస్తుంటారు. వసంత పంచమి రోజున అమ్మవారు జన్మించారు. వసంత పంచమి (vasant panchami) సందర్భంగా త్రిపురలో ఓ కాలేజీలో అమ్మవారి విగ్రహం నెలకొల్పారు. ఆ విగ్రహానికి చీర లేదని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి.

వివాదం ఇలా..

వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని నిష్టగా కొలుస్తారు. త్రిపుర ఆర్డ్ అండ్ క్రాప్ట్ కాలేజీలో అమ్మవారిని అవమానించారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మండిపడింది. ఆ విగ్రహనికి చీర కట్టాలని కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి చేశారు. ఏబీవీపీకి భజరంగ్ దళ్ జత కలిసింది. కాలేజీ మేనెజ్ మెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.

విగ్రహం తొలగింపు

కాలేజీలో నెలకొల్పిన సరస్వతీ విగ్రహంపై ఏబీవీపీ, భజరంగ్ దళ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. హిందూ ఆలయాల్లో ఉన్న శిల్ప రూపాలకు అనుగుణంగా తాము ఏర్పాటు చేసిన విగ్రహం ఉందని స్పష్టం చేసింది. హిందువుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. చివరికి ఏబీవీపీ, భజరంగ్ దళ్ ఒత్తిడికి తలొగ్గింది. కాలేజీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించింది. పూజ మందిరం వెనక ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచింది. వివాదం నేపథ్యంలో కాలేజీకి పోలీసులు చేరుకున్నారు. గొడవ గురించి ఏబీవీపీ, భజరంగ్ దళ్, కాలేజీ యాజమాన్యం తమకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 09:52 AM