Guinness World Record: ఒకేసారి 555 మందికి వర్మ చికిత్స..
ABN , Publish Date - Dec 20 , 2024 | 10:56 AM
ఒకే సమయంలో 555 వర్మ చికిత్స నిపుణుల ద్వారా 555 మందికి చికిత్స చేసి జాతీయ సిద్ధ వైద్య సంస్థ (ఆసుపత్రి) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ సిద్ధ వైద్య సంస్థ నిర్వాహకులు దేశవ్యాప్తంగా సిద్ధ వైద్యానికి ప్రాచుర్యం కల్పించేలా గత యేడాది ఢిల్లీ నుంచి కన్నియాకుమారి(Kanyakumari) వరకు ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు.
- తాంబరం సిద్ధవైద్య సంస్థ గిన్నిస్ రికార్డు
చెన్నై: ఒకే సమయంలో 555 వర్మ చికిత్స నిపుణుల ద్వారా 555 మందికి చికిత్స చేసి జాతీయ సిద్ధ వైద్య సంస్థ (ఆసుపత్రి) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ సిద్ధ వైద్య సంస్థ నిర్వాహకులు దేశవ్యాప్తంగా సిద్ధ వైద్యానికి ప్రాచుర్యం కల్పించేలా గత యేడాది ఢిల్లీ నుంచి కన్నియాకుమారి(Kanyakumari) వరకు ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. 3333 కి.మీ. 20 రోజుల్లో ప్రయాణించి ప్రతిరోజూ ఓ రాష్ట్రంలో సిద్ధ వైద్య శిబిరాలు, ప్రచార కార్యక్రమాలను చేపట్టి పలువురి ప్రశంసలందుకున్నారు. అదే రీతిలో సిద్ధ వైద్యంలోని వర్మ వైద్య పద్ధతులపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జరపాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Deputy CM: క్రైస్తవుడునని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా..
ఆ మేరకు బుధవారం ఆస్పత్రి ప్రాంగణంలో ఒకే సమయంలో 555 మంది వర్మ చికిత్సా నిపుణుల ద్వారా 555 మందికి స్వీయరక్షణ వర్మ వైద్య పరిహారాలను అందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. గిన్నీస్ సంస్థ ప్రతినిధి విలియం రాబర్ట్ ఆ జాతీయ సిద్ధ వైద్య సంస్థ (ఆసుపత్రి) నిర్వాహకులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఆ వైద్య సంస్థ సంచాలకులు డాక్టర్ ఆర్.మీనాకుమారి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ గోడ్సే ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.
సిద్ధ వైద్య సంస్థ డీన్ డాక్టర్ ఎం. మీనాక్షి సుందరం, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ క్రిష్టియానా తదితరులు పాల్గొన్నారు. వర్మ చికిత్స గురించి డాక్టర్ మీనాకుమారి మాట్లాడుతూ సిద్ధ వైద్యంలో తక్షణ పరిష్కారం ఆచరించే అద్భుతమైన వైద్య విధానం వర్మ చికిత్స అని, వర్మకళ అనేది ఆత్మరక్షణకు ఉపయోగపడేదిగా భావిస్తున్నప్పటికీ ఈ వర్మచికిత్స అంతర్భాగమని చెప్పారు. మందులులేని చికిత్సా పద్ధతి కూడా ఇదేనని చెప్పారు.
మెదడు, నాడీ మండలానికి సంబంధించిన పక్షవాతం, మూర్ఛ, వెన్నెముక, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను వైద్య నిపుణులు ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా రెండు చేతులతో మసాజ్ చేస్తూ రోగులను త్వరగా కోలుకునేలా చేస్తారని ఆమె వివరించారు. ప్రమాదాల్లో గాయపడేవారికి తక్షణ ఉపశమనం అందించేది కూడా ఈ వర్మ చికిత్సేనని చెప్పారు. భారతీయ సిద్ధవైద్యంలో ఈ వర్మ చికిత్స ప్రధాన పాత్రన పోషిస్తుందనటం అతిశయోక్తి కాదని ఆమె పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్ ఏ1
ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!
ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!
ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..
Read Latest Telangana News and National News