Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!
ABN , Publish Date - Dec 08 , 2024 | 09:50 AM
కదులుతున్న కారు టాపుపై కూర్చుని వీడియోలకు ఫోజిచ్చిన ఓ పోలీసు అధికారి కుమారుడి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. హర్యానాలో వెలుగు చూసిన ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కదులుతున్న కారు టాపుపై కూర్చుని వీడియోలకు పోజిచ్చిన ఓ పోలీసు అధికారి కుమారుడి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. హర్యానాలో వెలుగు చూసిన ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Viral).
రక్షిత్ బేణివాల్ అనే యువకుడు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ కారు టాపుపై కూర్చుని ప్రయాణం చేశాడట. స్థానిక మీడియా కథనాల ప్రకారం, రక్షిత్‌కు ఇన్‌స్టాలో 40 వేల మంది, యూట్యూబ్‌లో 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు తరచూ తన వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటాడు. తాజా వీడియోలో అతడు కారు టాపుపై కూర్చుని రద్దీగా ఉన్న రోడ్డుపై ప్రయాణించాడు.
Viral: జస్ట్ 2 ఏళ్ల వయసు.. ఇంత స్పీడేంటిరా! ఈ తరం రేంజే వేరు!
రక్షిత్ కూర్చున్న మహీంద్రా థార్ కారు మధ్య ఉండగా ఇతర కార్లు చుట్టూ ఎస్కార్ట్‌లా ప్రయాణించాయి. ఇదంతా అతడు వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది చాలదన్నట్టు.. వీడియోలోని మరో సీన్‌లో మా నాన్న అంతా చూసుకుంటాడు అన్న క్యాప్షన్ జత చేశాడు. ‘‘నువ్వు కానీ.. అంతా నేను చూసుకుంటా అని చెప్పే నాన్న నాకున్నాడు’’ అని ఆ క్యాప్షన్‌పై రాసుంది.
సుమారు వారం క్రితం షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకూ మూడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రక్షిత్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఇలాంటి అనేక వీడియోలో ఉన్నాయి. తన ప్రొఫైల్‌కు పిన్ చేసి ఉన్న ఓ వీడియోకు ఏకంగా 35 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలు ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
Psychological Games: పురుషులు మహిళలపై ప్రయోగించే మైండ్ గేమ్స్ ఇవే!
ఈ ఘటనపై పూణెకు చెందిన ఓ వ్యక్తి ఘాటుగా స్పందించారు. ‘‘అసలు హర్యానాలో ఏం జరుగుతోంది. ఓ పోలీసు అధికారి కుమారుడు వాహనం టాపుపై కూర్చుని ప్రయాణిస్తూ అంతా మా నాన్న చూసుకుంటాడని అనడమేంటి? ఆయన చూసేది ఏంటి? ఇలాంటి వాళ్ల కార్లు సీజ్ చేయాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రమాదకరమైన ఒరవడి అని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఉన్నత వర్గాలకు చెందిన కొందరు ఎంజాయ్ చేసే ప్రత్యేక అధికారాలు, సామాజిక బాధ్యత గురించి కొందరు ప్రస్తావించారు. ఇలాంటి వివిధ రకాల కామెంట్స్ మధ్య వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.