Share News

Heatwave: మండిపోతున్న ఎండలు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:44 PM

వేసవికాలం వచ్చేసింది.. ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రత కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో వేడి తరంగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?

Heatwave: మండిపోతున్న ఎండలు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు
Summer Alert

వేసవికాలం వచ్చేసింది.. ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రత కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో వేడి తరంగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? వాటి కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్సుఖ్ మాండవియా (Mansukh Mandaviya) గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌తో పాటు పలువురు ప్రముఖ వైద్యులు, ఇతర నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

ఏం చేయాలి?

* ఎల్లప్పుడూ హైడ్రేడెట్‌గా ఉండాలి. సమయానుకూలంగా నీళ్లు తాగుతూ ఉండాలి.

* ఎండలి మండిపోతున్నాయి కాబట్టి.. ప్రత్యక్ష సూర్యకాంతిని నిరోధించేందుకు ప్రయత్నించాలి.

* మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య.. బయట తిరగకుండా ఇండోర్స్‌లోనే ఉండాలి.

ఏం చేయకూడదు?

* ఈ మండుటెంటల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా జాగ్రత్త పడాలి.

* మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వంట చేయడం మానుకోవాలి.

* వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను ఎక్కువసేపు ఉంచొద్దు.

* మద్యపానం, టీ, కాఫీ, చక్కెర పానీయాలు, ఫిజీ డ్రింక్స్‌ని మానుకోవాలి.

* చెప్పులు లేదా షూస్ లేకుండా బయట ఏమాత్రం తిరగకూడదు.


Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు.. 50 ఏళ్లు దాటినా..

ఇదే సమయంలో.. వేడిని అధిగమించేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్తలను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇంటిని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని.. ఇందుకోసం కర్టెన్లు, షట్టర్స్, సన్‌షేడ్స్‌ని వినియోగించాలని పేర్కొంది. రాత్రి సమయంలో కిటికీలను తెరిచి ఉంచితే శ్రేయస్కరమని అధికారులు చెప్తున్నారు. పగటిపూట దిగువ అంతస్తుల్లో ఉండటానికి ప్రయత్నించాలి. శరీరాన్ని చల్లబరచుకోవడం కోసం.. ఫ్యాన్ & తడి బట్టలు ఉపయోగించాలని ఆరోగ్య శాఖ సలహా ఇస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 06:29 PM