Lakshadweep Navy base: లక్షద్వీప్‌లో భారత కొత్త నౌకా స్థావరం 'ఐఎన్ఎస్ జటాయు'
ABN , Publish Date - Mar 01 , 2024 | 02:49 PM
హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త నావికాదళ స్థావరాన్ని భారత్ వచ్చే వారం ప్రారంభించనుంది. లక్షద్వీప్ లోని మినీకాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరానికి 'ఐఎన్ఎస్ జటాయు'గా పేరుపెట్టారు.
మినీకాయ్: హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని (Indian Ocean Region) మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త నావికాదళ స్థావరాన్ని (Navy base) భారత్ వచ్చే వారం ప్రారంభించనుంది. లక్షద్వీప్ (Lakshadweep)లోని మినీకాయ్ (Minicoy) ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరానికి 'ఐఎన్ఎస్ జటాయు' (INS Jatayu)గా పేరుపెట్టారు. ఈ నౌకా స్థావరం మాల్దీవుల నుంచి సుమారు 70 నాటకల్ మైల్స్ దూరంలో ఉంటుంది. మార్చి 4వ తేదీన జరిగే ఈ గ్రాండ్ సెర్మనీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు.
కొత్త నేవీ బేస్‌కు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ సైతం రానున్నారు. వీటిపై కమాండర్ల సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నుంచి టేకాఫ్ అయి, మరో దానిపై ల్యాండింగ్ కావడం వంటి హైటెంపో ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. జలాంతర్గాములు, మరి కొన్ని యుద్ధ నౌకలు కూడా ఇందులో పాలుపంచుకోనున్నాయి.
కాగా, జటాయి స్థావరానికి సమీపంలో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఆదిత్యను మోహరించనున్నట్టు రక్షణ అధికారులు చెబుతున్నాయి. క్రమంగా అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. హిందూ మహాసముద్రంలో సైనిక, వాణిజ్య, నౌకల కదలికలను పరిశీలించడానికి భారత్‌కు అవకాశం లభిస్తుంది. మరోవైపు, మల్టీరోల్ ఎంహెచ్ 60 యుద్ధ హెలికాప్టర్లను కూడా వచ్చేవారం దళంలోకి చేర్చుకోనున్నారు. గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలను కూడా ప్రారంభించనున్నారు.