IndiGo flight: మెడికల్ ఎమర్జెన్సీతో ఇండిగో విమానం దారి మళ్లింపు
ABN , Publish Date - Mar 29 , 2024 | 04:59 PM
పాట్నా నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన 'ఇండిగో' విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్‌కు దారి మళ్లించిన ఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అవసరమైన సహాయాన్ని విమాన సిబ్బంది అందించినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇండిగో తెలిపింది.
ఇండోర్: పాట్నా నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన 'ఇండిగో' (IndiGo) విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ (Medical emergency) కారణంగా ఇండోర్ (Indore)కు దారి మళ్లించిన ఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అవసరమైన సహాయాన్ని విమాన సిబ్బంది అందించినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇండిగో తెలిపింది.
''పాట్నా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ఇండిగో ఫ్లయిట్ 6E-178ను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్‌కు తరలించాం. అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి సిబ్బంది సాయం అందించారు. ప్రయాణికుడి ఆరోగ్యానికి కెప్టెన్ ప్రాధాన్యత ఇచ్చి విమానాన్ని వెంటనే ఇండోర్‌కు మళ్లించారు. అక్కడికి చేరుకోగానే ప్రయాణికుడిని తదుపరి చికిత్స కోసం తరలించాం'' అని ఇండిగో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.