Share News

Land for job case: రబ్రీదేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిలు మంజూరు

ABN , Publish Date - Feb 28 , 2024 | 05:38 PM

రైల్వేలో భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురూ దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవవడంతో వారికి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నే బెయిల్ మంజూరు చేశారు.

Land for job case: రబ్రీదేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిలు మంజూరు

న్యూఢిల్లీ: రైల్వేలో భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసు (Land for job case)లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi), ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురూ దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవవడంతో వారికి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నే బెయిల్ మంజూరు చేశారు. లక్ష రూపాయల బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీ బాండ్‌ మీద బెయిల్ మంజూరు చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల పెద్ద కుమార్తె అయిన మిసా భారతి ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.


కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిలు మంజూరు చేసేముందు కఠిన షరతులు విధించాలని కోర్టును ఈడీ బుధవారంనాడు కోరింది. దీనికి ముందు గత ఫిబ్రవరి 9న వీరి బెయిలు దరఖాస్తు విచారణకు వచ్చింది. రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్‌పై అడ్వాన్స్ ఆర్గుమెంట్లకు సమయం కావాలని ఈడీ కోరడంతో న్యాయమూర్తి ఈ ముగ్గురికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. రెగ్యులర్ బెయిల్ కోసం రబ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు బుధవారంనాడు కోర్టు ముందు హాజరయ్యారు.

Updated Date - Feb 28 , 2024 | 05:38 PM