Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..
ABN , Publish Date - Dec 11 , 2024 | 11:12 AM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలు పెరుగుదల, ప్రతినిధులకు బెదిరింపులపై చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నోటీసులు ఇచ్చారు. అలాగే సంభాల్ నుంచి రత్లాం వరకు పెరుగుతోన్న మత హింసపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలని నోటీసులు ఇచ్చారు.
న్యూఢిల్లీ, డిసెంబర్11: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం సభ సమావేశం కానుంది.ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలు పెరుగుదల, ప్రతినిధులకు బెదిరింపులపై చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నోటీసులు ఇచ్చారు. అలాగే సంభాల్ నుంచి రత్లాం వరకు పెరుగుతోన్న మత హింసపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు
సభలో వీటిపై చర్చించాలని ఆయన నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. లోక్‌సభలో రైల్వే (సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లులు ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు. ఇక బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఈ మూడు బిల్లులు ఆమోదించుకోనేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.
Also Read: హిందువులపై దాడులు.. స్పందించిన బంగ్లాదేశ్
ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. అయితే సభలో అదానీ అంశంపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
మరోవైపు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ రాజ్యసభలో ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఆరోపించాయి. దీంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. ఈ మేరకు మంగళవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు అందజేశాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. తమకు 70 మంది ఎంపీల మద్దతు ఉందని తెలిపారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే కాదు.. ఇండియా కూటమిలోని రాజకీయ పార్టీల అధినేతలు సైతం సంతకాలు చేయలేదనే ఓ చర్చ అయితే నడుస్తోంది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్నాయి.
మంగళవారం సైతం అదానీ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణంలో విపక్ష ఎంపీల ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ- పారిశ్రామిక వేత్త అదానీ భాయ్ భాయ్ అంటూ ముద్రించిన బ్యాగ్‌లను పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శిస్తూ వారు తమ నిరసన తెలిపారు. దీనిపై సభలో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇక సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యలు ఆందోళన నేపథ్యంలో మధ్యాహ్నం 12.00 గంటలకు సభను వాయిదా వేశారు. సభ మళ్లీ తిరిగి ప్రారంభమైనా విపక్షాల నిరసనలు ఆగకపోవడంతో.. సభను బుధవారానికి వాయిదా వేసిన విషయం విధితమే.
For National news And Telugu News