Patanjali: తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టుకు పతంజలి క్షమాపణలు..
ABN , Publish Date - Mar 21 , 2024 | 12:55 PM
తప్పుడు ప్రకటనల కేసులో కోర్టుకు సమాధానం చెప్పాలంటూ పతంజలి ఆయుర్వేదాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆదేశించిన తరుణంలో కంపెనీ కీలక ప్రకటన చేసింది.
తప్పుడు ప్రకటనల కేసులో కోర్టుకు సమాధానం చెప్పాలంటూ పతంజలి ఆయుర్వేదాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆదేశించిన తరుణంలో కంపెనీ కీలక ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయబోనని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ అన్నారు. బాబా రామ్‌దేవ్‌తో పాటు ఆచార్య బాలకృష్ణలు ఏప్రిల్ 2న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు ఉన్నప్పటికీ తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకు కోర్టు నోటీసు జారీ చేసింది.
Elections 2024: డిపాజిట్ కట్టేందుకు రూ.10 నాణేలు.. లెక్కపెట్టలేక తలపట్టుకున్న అధికారులు..
గతంలో జారీ చేసిన నోటీసులకు పతంజలి ఆయుర్వేదం ఎండీ ఆచార్య బాలకృష్ణ సమాధానం ఇవ్వకపోవడంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు ఆయనపై ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించింది. కొవిడ్ టీకాతో పాటు మెడిసిన్ల కు వ్యతిరేకంగా రామ్‌దేవ్ ప్రచారం నిర్వహిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆరోపించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.