Share News

Lok Sabha Elections: వారణాసిలో మోదీ నామినేషన్.. ముహుర్తం ఖరారు

ABN , Publish Date - May 01 , 2024 | 06:33 PM

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ముచ్చటగా మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన నామినేషన్ వేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. మే 13వ తేదీ ఆయన నామినేషన్ వేయనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Lok Sabha Elections: వారణాసిలో మోదీ నామినేషన్.. ముహుర్తం ఖరారు

న్యూఢిల్లీ, మే 1: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ముచ్చటగా మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన నామినేషన్ వేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. మే 13వ తేదీ ఆయన నామినేషన్ వేయనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ రోజు ర్యాలీలో పాల్గొనే ముందు ప్రధాని మోదీ.. కాశీ విశ్వేశ్వరుడుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ


Lok Sabha Elections: నామినేషన్ వేసిన మేనక గాంధీ.. ఆ రెండు స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

అనంతరం ఆయన వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. 2014 ఎన్నికల నుంచి వారణాసిలో మోదీ ఎన్నికవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రత్యర్థిగా యూపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

వారణాసి లోక్‌సభ స్థానానికి ఎన్నికల చివర దశ.. అంటే ఏడో దశలో.. జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. అందుకోసం మే 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అందుకు ఒక రోజు ముందు మోదీ నామినేషన్ వేయనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కోసం ఇప్పటికే పార్టీ రాష్ట్ర యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 06:33 PM