Rameswaram Cafe Blast: సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 02 , 2024 | 07:56 AM
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు(Rameswaram Cafe Blast) తర్వాత కర్ణాటక బీజేపీ చీఫ్ బీ విజయేంద్ర సిద్ధరామయ్య ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు.
Rameswaram Cafe Blast: బెంగళూరు(bangalore)లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై కర్ణాటక బీజేపీ చీఫ్ బీ విజయేంద్ర(Vijayendra Yediyurappa) సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని విజయేంద్ర అన్నారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అరాచకంలోకి నెట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆరోపించారు.
మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) ఈ ఘటనపై సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య(bjp mp tejasvi surya) అన్నారు. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వేచ్ఛనివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఈ అంశంపై తన ప్రకటనను మారుస్తోందని బీజేపీ ఎంపీ తేజస్వీ పేర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్(BJP leader R Ashok) కూడా శుక్రవారం సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి నీచ శక్తులపై అధికార కాంగ్రెస్(congress) ఆలోచనా ధోరణి మార్చుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్రాండ్ బెంగళూరు గురించి మాట్లాడుతున్నారు. కానీ అది 'బాంబ్ బెంగళూరు' అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. లా అండ్ ఆర్డర్‌ను ఈ ప్రభుత్వం సరిగ్గా నడపడం లేదని పేర్కొన్నారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మైసూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) స్పందించారు. మాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయం తర్వాత ఎవరో బ్యాగ్‌తో వెళ్లిపోయారు. అక్కడి నుంచి పేలుడు సంభవించింది. ప్రస్తుతం సీసీటీవీ తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని అందరూ సహకరించాలన్నారు. మరోవైపు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ID) పేలుడుకు అవకాశం ఉందని, ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించిందని హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. విచారణ తర్వాతే పేలుడు జరిగిన తీరు తెలుస్తుందని తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Anant Radhika Wedding: ముఖేష్- నీతా అంబానీ డ్యాన్స్ వీడియో