Mamata Banerjee: అత్యాచార కేసుల్లో మీడియో ట్రయిల్స్ అపండి
ABN , Publish Date - Oct 06 , 2024 | 07:37 PM
నేరం నేరమేనని, దీనికి కులం, మతం అనే తేడా లేదని మమతా బెనర్జీ అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు సుకోవాల్సిందేనన్నారు. అత్యాచార కేసుల్లో మీడియా ట్రయిల్స్ వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు.
కోల్‌కతా: సౌత్ 24 పరగణాలలోని కుల్టాలిలో పదేళ్ల బాలికపై శనివారం జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై 'పోక్సో' (POCSO) యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పోలీసులను ఆదేశించారు. నిందితులకు మూడునెలల్లోగా మరణశిక్ష పడేలా చూడాలన్నారు. కోల్‌కతా పోలీస్ బాడీ గార్డ్ లైన్స్‌లో పలు దుర్గా పూజలను వర్చువల్ తరహాలో సీఎం ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, నేరం నేరమేనని, దీనికి కులం, మతం అనే తేడా లేదని అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. అత్యాచార కేసుల్లో మీడియా ట్రయిల్స్ ఆపేయాలని, ఇందువల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు.
Bihar: స్నానానికి వెళ్లి నదిలో మునిగిపోయిన ఐదుగురు చిన్నారులు మృతి
కాగా, ట్యూషన్ కోసం వెళ్లిన బాలిక తిరిగి రాలేదంటూ శనివారం రాత్రి ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, ఈ కేసులో నిందితుడుని అరెస్టు చేయగా నేరాన్ని అంగీకరించాడని సౌత్ 24 పరగణాల ఎస్పీ పలాస్ చంద్ర ధాలి తెలిపారు. ఇలాంటి కేసుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. బాలికపై హత్యాచారం ఘటనతో గ్రామస్థులు శనివారంనాడు పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.