AAP: అతిశీకి ఎన్నికల సంఘం నోటీసులు.. సమాధానం ఇవ్వాలంటూ డెడ్ లైన్..
ABN , Publish Date - Apr 05 , 2024 | 01:58 PM
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆప్ ( AAP ) పార్టీకి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ పార్టీ నాయకురాలు, మంత్రి అతిశీకి ఎన్నికల సంఘం నోటీసు పంపింది.
ల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆప్ ( AAP ) పార్టీకి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ పార్టీ నాయకురాలు, మంత్రి అతిశీకి ఎన్నికల సంఘం నోటీసు పంపింది. బీజేపీలో చేరడానికి తనకు ఆఫర్ వచ్చిందని అతిశీ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ నోటీసులు పంపించింది. ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటలలో ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరింది. పార్టీలో చేరే ఆఫర్ ఎవరి వైపు నుంచి వచ్చిందో వెల్లడించాలని కోరింది. నిజానిజాలు బయటకు రాకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ హెచ్చరించింది.
The Kerala Story: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. ముఖ్యమంత్రి ఆర్డర్స్..
ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అతిశీ ఆరోపించారు. త్వరలోనే తనకూ నోటీసులు పంపిస్తారని ఆపై జైల్లో పెడతారని అతిశీ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అందరినీ జైలులో పెట్టినా తాము మాత్రం బీజేపీకి భయపడమని, అక్కడి నుంచే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
Congress: ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వరాలు..
బీజేపీలో చేరాలని తనకు సంప్రదింపులు వచ్చాయని, ఈ పని చేసి రాజకీయ జీవితాన్ని కాపాడుకోవచ్చని పలువురు ఆఫర్ చేశారని అతిశీ చెప్పారు. ఇప్పటికే సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ను జైలులో వేసిన బీజేపీ త్వరలోనే మిగతా నాయకులపై చర్యలు తీసుకుంటుందని ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.