Share News

Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:16 PM

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడిన కొండ చరియలను తొలగించారు. దీంతో గురువారం నుంచి బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పున: ప్రారంభమైనాయి.

Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ

ఉత్తరాఖండ్, జులై 11: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడిన కొండ చరియలను తొలగించారు. దీంతో గురువారం నుంచి బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పున: ప్రారంభమైనాయి. ఈ మేరకు చమోలీ పోలీసులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవల ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఛమోలీ జిల్లాలోని బహనీర్పానీ , జోషీమఠి రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సదరు జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

Also Read: IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్‌ చాట్ వైరల్

Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ వీడియో సందేశం..


Also Read: Peshawar: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

అలాగే బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై బుధవారం పాతాళ గంగా లంగసీ టనల్ వద్ద భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ఆ యా రహదారులను సైతం ఈ రోజు పునరుద్దరించారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆ యా పరిసర ప్రాంతాల్లో రహదారులపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇక జులై 5వ తేదీన సైతం బద్రీనాధ్ వద్ద ఇటువంటి పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు బద్రీనాథ్‌లో దైవ దర్శనం చేసుకుని బైక్‌పై వస్తున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులపై భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ దంపతులు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే.

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 05:17 PM