Yogi Adityanath: రాళ్లు రువ్విందెవరు? వాళ్లను విడిచిపెట్టకూడదు.. సంభాల్ హింసపై యోగి నిప్పులు
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:17 PM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు మాట్లాడుతూ, సంభాల్ అల్లర్ల చరిత్ర తెలుసుకోవాలంటే 1947 సంవత్సరానికి వెళ్లాలన్నారు. అప్పటి నుంచి చూస్తే 1974లో 184 మంది హిందువులను సజీవదహనం చేశారని అన్నారు.
లక్నో: సంభాల్ వివాదం (Sambhal row)పై విపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విరుచుకుపడ్డారు. నిజాన్ని దాటిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో రెచ్చగొట్టే ఉపన్యాసాల కారణంగానే సంభాల్‌లో వాతావరణం దిగజారినట్టు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు మాట్లాడుతూ, సంభాల్ అల్లర్ల చరిత్ర తెలుసుకోవాలంటే 1947 సంవత్సరానికి వెళ్లాలన్నారు. అప్పటి నుంచి చూస్తే 1974లో 184 మంది హిందువులను సజీవదహనం చేశారని, 209 మంది హిందువులను చంపారని చెప్పారు. ఇటీవల చోటుచేసుకున్న సంభాల్ హింసాకాండ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. రాళ్లు రువ్విన వారెవరు? అని ఆయన నిలదీశారు. వాళ్లెవరరైనా సరే విడిచిపెట్ట రాదని అన్నారు.
''ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2017 నుంచి ఇప్పటి వరకూ ఉత్తరప్రదేశ్‌లో మత ఘర్షణలు 99 శాతం నుంచి 97 శాతానికి తగ్గాయి'' అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. వాస్తవానికి 2017 నుంచి ఎలాంటి మతఘర్షణలు లేవన్నారు. అయితే ఎన్‌సీఆర్‌బీ డాటా ప్రకారం 2012-17 మధ్య రాష్ట్రంలో 815 మత ఘర్షణలు జరిగి 192 మంది ప్రాణాలు కోల్పోయారని, 2007-2011 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పారు.
'జై శ్రీరామ్' అంటే రెచ్చగొట్టడం కాదు
''ముస్లింల ఊరేగింపులు హిందువులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల మీదుగా వెళ్తుంటాయి. అలాంటప్పుడు హిందూ శోభాయాత్ర ముస్లిం ప్రాంతం నుంచి ఎందుకు వెళ్లకూడదు? మీ పండుగలు ప్రశాంతంగా జరుపుకొని ఇతరుల పండుగలు జరక్కూడదంటే ఎలా?'' అని యోగి ప్రశ్నించారు. ''జై శ్రీరామ్'' నినాదం రెచ్చగొట్టే నినాదం కాదని కూడా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, మాట్లాడుకునేటప్పుడు 'రామ్ రామ్' అని సంబోధించుకుంటారని, ఏ పని చేసినా రాముడిని తలుచుకునే చేస్తారని చెప్పారు.
ఇవి కూడా చదవండి...