Hair care : వెంట్రుకలు పెళుసుగా ఉంటే పెరుగు మాస్క్ వేయండి.. సరిపోతుంది..!
ABN , Publish Date - Aug 01 , 2024 | 12:04 PM
వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యానికి, జుట్టు రాలిపోవడం, పేలవంగా మారడం, చుండ్రు సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా వానలో తడవడం కూడా జుట్టును బలహీనంగా మారుస్తుంది. వాన నీటిలో నానిన జుట్టు పెళుసుగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే, పెరుగుతో జుట్టుకు పోషణ అందించాలి.
వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యానికి, జుట్టు రాలిపోవడం, పేలవంగా మారడం, చుండ్రు సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా వానలో తడవడం కూడా జుట్టును బలహీనంగా మారుస్తుంది. వాన నీటిలో నానిన జుట్టు పెళుసుగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే, పెరుగుతో జుట్టుకు పోషణ అందించాలి.
జుట్టు సంరక్షణ విషయానికి వచ్చే సరికి మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటాం. సహజమైన పదార్థాలను మరిచిపోతాం. ఎలాంటి రసాయనాలూ లేని సహజమైన పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగు జుట్టు పెరుగుదలకు మంచిది. పెరుగులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఇందులోని హెల్తీ ఫ్యాట్స్ జుట్టుపోషణలో ముఖ్యంగా పనిచేస్తాయి. కోల్పోయిన తేమను తిరిగి నింపడానికి సహాయపడతాయి. పొడిగా మారిన, పెళుసైన జుట్టును మృదువుగా చేసేందుకు పెరుగు చక్కని ఎంపిక.
జుట్టుకు పెరుగు మాస్క్..
పెరుగు..
పెరుగును జుట్టుకు పూయడం వల్ల వెంట్రుకలకు పోషణ అందుతుంది. జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది. పెరుగు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
పెరుగు, గుడ్డు..
పెరుగులో గుడ్డు మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. ఈ హెయిర్ మాస్క్ తలకు పట్టించి అరగంట సేపు ఉంచి, ఆపైన కడగాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకసారి అప్లై చేయాలి.
Health Tips : ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెడనొప్పి ఇబ్బంది ఉండదు..!
పెరుగు, తేనె..
పెరుగు, తేనె కలిపిన హెయిర్ మాస్క్ కారణంగా జుట్టు పెరగడమే కాదు, మృదువుగా కూడా మారుతుంది. హెయిర్ మాస్క్ సిద్ధం చేయడానికి ఒక కప్పు పెరుగు, రెండు స్పూన్ల తేనె కలపాలి. ఈ హెయిర్ మాస్క్‌ను మూలాల నుంచి జుట్టు చివర్ల వరకూ పట్టించి 20 నిమిషాల తర్వాత కడగాలి.
గుడ్లు, పెరుగు, తేనె..
జుట్టు రాలడాన్ని అదుపుచేయాలంటే ఈ హెయిర్ మాస్క్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. హెయిర్ మాస్క్ చేయడానికి 6 నుంచి 7 స్పూన్ల పెరుగు, రెండు స్పూన్లు తేనె, ఒక గుడ్డు తెల్ల సొన బాగా కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపూ లేకుండా తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !
పెరుగు మాస్క్ పడకపోతే..
1. పెరుగు మాస్క్ తలకు పట్టించిన తర్వాత అలెర్జీ అయినట్లయితే తలపై దురద, ఎరుపుగా మారడం, చికాకు వంటి లక్షణాలు ఉంటాయి.
2. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎక్కువసేపు తలకు పట్టించి ఉంచితే వెంట్రుకలను పొడిబారే విధంగా చేస్తుంది.
Health Tips : వానాకాలం దగ్గు తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి చాలు..!
3. హెయిర్ డై వేసుకునేవారు పెరుగు మాస్క్ వేసుకున్నట్లయితే ఇది హెయిర్ కలర్‌ని పాలిపోయేలా చేస్తుంది.
4. పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టుకు ప్రోటీన్ ఓవర్ లోడ్ అయ్యే అవకాశం కూడా ఉంది.
5. ప్రోటీన్ ఓవర్ లోడ్ అయితే, జుట్టు దృఢత్వం తగ్గి వెంట్రుకలను విరిగిపోయేలా చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.