Children Health : వర్షాకాలంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!
ABN , Publish Date - Jul 02 , 2024 | 11:23 AM
నిలిచిపోయిన నీరు కారణంగా దోమల ఉత్పత్తి కేంద్రంగా మారి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇంటికి సమీపంలో కంటైనర్లు, నిలువ ఉన్న నీరు ముఖ్యంగా సాయంత్రం,రాత్రి సమయంలో దోమలు ఎక్కువగా చురుకుగా ఉన్నప్పుడు దోమతెరలు ఉపయోగించాలి.
వర్షాకాలం మొదలయ్యాకా, వాతావరణంలో వేడి తగ్గినా, వర్షాల కారణంగా వాతావరణం చల్లగా, తేమగా మారి మరీ అనారోగ్యాలు, అంటువ్యాధులు పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వ్యాధుల బారిన పడేది పిల్లలు, వారికి ఈ సమయం కాస్త గడ్డుకాలమే. తేమ కారణంగా జలుబు, దగ్గు, జ్వరాలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఇలా చాలా రకాలుగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షం కారణంగా తేమ, బ్యాక్టీరియా, వైరస్ల వల్ల పిల్లలు ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఈ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచడానికి చిట్కాలు ఇవే..
పోషకాహారంతో రోగరోనిరోధక శక్తి..
విటమిన్లు, ఖనిజాలతో నిండిన సమతుల్య ఆహారం పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. భోజనంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలను ఇవ్వాలి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. నారింజ, స్ట్రాబెర్రీ, బెల్ పెప్పర్స్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యంాగ ప్రయోజనకరంగా ఉంటాయి.
పరిశుభ్రంగా..
అంటువ్యాధులను నివారించడానికి పరిశుభ్రత పద్దతులను పాటించడం కీలంక. ముఖ్యంగా భోజనానికి ముందు రెస్ట్ రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలి. గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు కూడా తగ్గుతాయి.
నిలిచిపోయిన నీరు కారణంగా..
నిలిచిపోయిన నీరు కారణంగా దోమల ఉత్పత్తి కేంద్రంగా మారి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇంటికి సమీపంలో కంటైనర్లు, నిలువ ఉన్న నీరు ముఖ్యంగా సాయంత్రం,రాత్రి సమయంలో దోమలు ఎక్కువగా చురుకుగా ఉన్నప్పుడు దోమతెరలు ఉపయోగించాలి.
Health Benefits : అంజీర్ ఎప్పుడు తినాలి. దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..!
తగిన దుస్తులు..
వర్షాకాలంలో తేలికైన ఆరిపోయే దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను పెంచేది ఎక్కువ సమయం తడి దుస్తుల్లో ఉండటం కూడా ఒక కారణం. జల్లులకు తడిసిపోకుండా ఉండేలా గొడుగు, రెయిన్ కోట్ ఉపయోగిస్తూ ఉండాలి.
పరిసరాలు.. పరిశుభ్రం..
నివాస స్థలాలను శుభ్రంగా, పొడిగా ఉంచాలి. అలా లేని పక్షంలో శ్వాసకోశ సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా బాత్రరూమ్స్, కిచెన్ వంటి తేమ పెరిగే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ ఉండాలి. గాలి ప్రసరణకు వీలుగా తేమ స్థాయిలను తగ్గించడానికి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
ఇటు వంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా వానాకాలం పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటే చల్లని వర్షాకాలాన్ని ఆస్వాదించేలా చేయచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.