Share News

Littles : సీతా ఫలం నేర్పిన నీతి

ABN , Publish Date - Oct 08 , 2024 | 12:16 AM

గౌతమీ నది తీరంలో ఆనందుడు అనే ముని కొందరు రాజ కుమారులకు విద్యా బుధ్దులు నేర్పిస్తూ ఉండేవాడు. ఒక రోజు ముని చుట్టు పక్కల గ్రామాల నుండి తన మాటలు వినడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉండగా,

Littles : సీతా ఫలం నేర్పిన నీతి

Littles : గౌతమీ నది తీరంలో ఆనందుడు అనే ముని కొందరు రాజ కుమారులకు విద్యా బుధ్దులు నేర్పిస్తూ ఉండేవాడు. ఒక రోజు ముని చుట్టు పక్కల గ్రామాల నుండి తన మాటలు వినడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉండగా, నీటిలో బాగా తడిచిపోయి ఉన్న ఒక వ్యక్తిని అతని శిష్యులు నలుగురు మోసుకుంటూ వచ్చారు. వారిని చూసిన ముని ఇలా అడిగాడు. ‘ఎవరు నాయనా ఇతను? ఎందుకిలా తడిచిపోయి ఉన్నాడు? అని అడిగాడు.దానికి శిష్యులు ‘ ఇతను మా కళ్ల ముందే నదిలో పడిపోయాడు స్వామీ. నీటిలో పడి కొట్టుకు పోతుంటే మేము కాపాడి తీసుకువచ్చాము’ అని చెప్పారు.ఆనందుడు ఆ వ్యక్తిని ఇలా అడిగాడు ‘ ఏం నాయనా ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయావా?అన్నాడు దానికి ఆ వ్యక్తి ‘ లేదు స్వామీ నాకు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి.

అవన్నీ పరిష్కరించుకునే మార్గం తెలియకనే ఆత్మ హత్య చేసుకుందాం అని నీటిలో నేనే దూకేసాను. ఈ లోగా మీ శిష్యులు నన్ను కాపాడి తీసుకువచ్చారు’ అన్నాడు. అది విన్న ముని తన శిష్యులతోఈతను చాలా నీరసంగాకనిపిస్తున్నాడు. ముందుగాఅతనికి కట్టుకోవడానికి వేరే పొడి బట్టలు ఇచ్చి,తినడానికి ఏ పండో ఫలమో ఇవ్వండి’ అని చెప్పాడు. శిష్యులు గురువు మాట ప్రకారమేఆ వ్యక్తికి మార్చుకోవడానికి బట్టలు ఇచ్చి, తినడానికి ఒక సీతాఫలం ఇచ్చారు.


అతనుసీతాఫలం తిని గింజలన్నీ తీసిపక్కన ఉమ్మేస్తూ వచ్చాడు అతను పండు తినడం పూర్తి చేసాక ఆనందుడు అతన్ని దగ్గరకుపిలిచి ఇలా అడిగాడు ఏం నాయనా ఆ గింజలన్నీఅలా పారేసావు ఇంతకీ పండు ఎలా ఉంది? అని అడిగాడు.పండు చాలా తియ్యగా మధురంగా ఉంది స్వామీ కానీ పండు బాగుందని పండుతో పాటు గింజలు లిననేలేము కదా.అందుకే గింజలన్నీ తీసి అలా పారేసాను’ అన్నాడు.

అన్ని గింజలు ఉండి ఇబ్బంది పెడుతున్నపుడు ఆ పండును తినకుండా పారేయలేకపోయావా? అన్నాడు ఆనందుడు. దానికి అతను ఇదేం న్యాయం స్వామీ? కొన్ని గింజలు వచ్చాయని అంత తియ్యని పండును కాదు అనుకుంటామా? గింజలు పక్కకు పెట్టి,పండు రుచిని ఆస్వాదించవచ్చు కదా ’ అన్నాడు. ఆ మాటలు విన్న ఆనందుడు మన జీవితం కూడా ఈ సీతాఫలం లాగే నాయనా.. కొన్ని కష్టాలు, సమస్యలు వచ్చాయని ఇంత మంచి జీవితాన్నిఅంతం చేసుకుంటామా? తప్పు కదూ ’ అన్నాడు ఆ మాటలలలో నిజం గ్రహించిన ఆ వ్యక్తి నిజమే స్వామీ అంటూ ముని వద్ద సెలవు తీసుకుని, ఇంటికి వెళ్లిపోయాడు.

Updated Date - Oct 08 , 2024 | 12:16 AM