Share News

USA: 99 ఏళ్ల భారతీయ మహిళకు అమెరికా పౌరసత్వం

ABN , Publish Date - Apr 07 , 2024 | 09:55 PM

అమెరికాలో తాజాగా 99 ఏళ్ల భారతీయురాలికి పౌరసత్వం లభించింది. ఓర్లాండోలోని అమెరికా వలసల శాఖ దాయిబాయ్ అనే వృద్ధురాలికి పౌరసత్వం ఇచ్చిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

USA: 99 ఏళ్ల భారతీయ మహిళకు అమెరికా పౌరసత్వం

ఎన్నారై డెస్క్: అమెరికాలో (USA) తాజాగా 99 ఏళ్ల భారతీయురాలికి పౌరసత్వం లభించింది. ఓర్లాండోలోని అమెరికా వలసల శాఖ దాయిబాయ్ అనే వృద్ధురాలికి (NRI) పౌరసత్వం ఇచ్చిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘‘వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అంటారు. దాయిబాయ్‌ విషయంలో ఇది రుజువైంది. భారత్‌కు చెందిన దాయి‌బాయ్ ఇటీవలే అమెరికా పౌరసత్వ ప్రమాణం చేశారు’’ అని అమెరికా వలసల శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా, దాయి‌బాయ్ కుమార్తె వలసల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు (Indian Origin woman gets US Citizenship).

Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఇప్పటికీ ఎంత మంది చనిపోయారంటే


కాగా, వలసల శాఖ పంచుకున్న ఈ గుడ్‌న్యూస్‌పై భారతీయుల నుంచి మిశ్రమస్పందన వ్యక్తమవుతోంది. పౌరసత్వం కోసం ఆమె దాదాపు ఓ జీవితకాలం వేచి చూసి ఉండొచ్చని కొందరు అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అనేక మంది హెచ్-1బీ వీసాదారుల పరిస్థితి ఇదేనని విచారం వ్యక్తం చేశారు. వీళ్లకు కనీసం గ్రీన్ కార్డు రావాలన్నా కొన్ని దశాబ్దాలు పడుతుందని వాపోయారు. ఈ మధ్యకాలంలో వీసాల జారీలోనూ జాప్యం జరుగుతోందని కొందరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 09:58 PM