CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - May 22 , 2024 | 11:49 AM
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన మనవడి పుట్టెంట్రుకలను స్వామి వారికీ సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. కాగా సీఎం హోదాలో శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వస్తున్న దృశ్యం.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ మార్గం ద్వారా ఆలయంలోకి వెళుతున్న దృశ్యం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్శంగా తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించుకున్నారు.

తిరుమలకు విచ్చేసిన భక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తున్న దృశ్యం.

తిరుమలలో తనను చూస్తున్న అభిమానులకు అభివాదం తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలలో తన మనవడిని భుజాలపై ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ వెళుతున్న దృశ్యం.

తిరుమల పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కారులో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరుతున్న దృశ్యం.
Updated at - May 22 , 2024 | 11:49 AM