అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీడ్రా
ABN, Publish Date - Mar 25 , 2025 | 03:35 PM
అనంతపురంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అనంత రాములు ఆంధ్రజ్యోతి పాఠకులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి యాజమాన్యం పాఠకుల కోసం ‘కార్ అండ్ బైక్ రేస్’ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ పురస్కారం నేపథ్యంలో అనంతపురంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా జరిగింది.

విజేతల ఎంపిక కోసం మంగళవారం లక్కీ డ్రా తీశారు.

అనంతపురంలోని యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

లక్కీ డ్రా ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలతోపాటు వందమంది ప్రోత్సాహక బహుమతుల కోసం విజేతలను ఎంపిక చేస్తారు.

కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి పాఠకులు, సిబ్బంది

గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రతి నెలా మూడు కూపన్ల చొప్పున నాలుగు నెలలకు 12 కూపన్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురించారు.

ఒక్కో నెల కూపన్లు ఒక సెట్టుగా.. నాలుగు నెలలకు నాలుగు సెట్ల కూపన్లను ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్ కార్యాలయానికి మూడు జిల్లాల నుంచి వేలాది మంది పాఠకులు కూపన్లు పంపించారు.

లక్కీ డ్రా ద్వారా అనంతపురం ఉమ్మడి జిల్లాలో మొదటి బహుమతి బైక్, ద్వితీయ బహుమతి రిఫ్రిజరేటర్, తృతీయ బహుమతి కలర్ టీవీ, వంద మందికి కన్సోలేషన్ బహుమతులు ఇస్తారు.

అలాగే త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి లక్కీడ్రాలో బంపర్ బహుమతిగా కారు గెలుచుకునే అవకాశం ఉంది.
Updated at - Mar 25 , 2025 | 03:38 PM