ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ విజేతల ఎంపిక
ABN, Publish Date - Mar 25 , 2025 | 05:18 PM
ఆంధ్రజ్యోతి పత్రిక పాఠకుల కోసం కార్ అండ్ బైక్ రేస్‌ను సంస్థ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు లక్కీ కూపన్ల డ్రా నిర్వహించారు.

ఆంధ్రజ్యోతి నిర్వహించిన కార్ అండ్ బైక్ రేస్ లక్కీ కూపన్ల డ్రా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.

లక్కీ డ్రా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సెలకాన్ హైపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేతినేని మురళీకృష్ణ, జెఎస్‌బి హ్యుందాయ్ సీఈవో కళ్యాణ్ సింగ్ ఠాకూర్, చందన బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జేవీ సురేష్, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య పాల్గొని విజేతలను ఎంపిక చేశారు.

లక్కీ డ్రాలో మొదటి బహుమతి మోటర్ బైక్‌ను సిద్ధిపేటకు చెందిన చొప్పదండి వేణుకృష్ణ గెలుచుకున్నారు.

లక్కీడ్రాలో రెండో బహుమతి రిఫ్రిజిరేటర్‌ను హైదరాబాద్ సాలర్‌జంగ్ కాలనీకి చెందిన సువర్ణ గెలుపొందారు.

లక్కీ డ్రాలో మూడో బహుమతి టీవీని నాగర్ కర్నూలుకు చెందిన చెన్నయ్య గెలుచుకున్నారు.

2024 నవంబరు 1 నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ మధ్య ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన 12 కూపన్లను నాలుగు సెట్లుగా చేసి పాఠకులు ఆంధ్రజ్యోతి కార్యాలయానికి పంపగా వాటిని డ్రా తీశారు.

విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా వారంతా ఆనందం వ్యక్తం చేశారు.

పాఠకులను ప్రోత్సహించడం కోసం ఆంధ్రజ్యోతి గత కొన్నేళ్లుగా కారు అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా పోటీని నిర్వహిస్తోంది.
Updated at - Mar 26 , 2025 | 03:39 PM