Share News

YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!

ABN , Publish Date - Mar 10 , 2024 | 09:29 PM

YS Jagan Siddam Sabha: అవును.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy) ప్రసంగంలో ఈ మధ్య అస్సలు పస ఉండట్లేదు. పైగా సెంటిమెంట్ పండించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిగో ఫలానా చేశాను.. మళ్లీ అధికారమిస్తే ఇంతకుమించి చేస్తానని చెప్పుకోలేక ఏదోదే మాట్లాడేస్తున్నారు...

YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!

అవును.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy) ప్రసంగంలో ఈ మధ్య అస్సలు పస ఉండట్లేదు. పైగా సెంటిమెంట్ పండించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిగో ఫలానా చేశాను.. మళ్లీ అధికారమిస్తే ఇంతకుమించి చేస్తానని చెప్పుకోలేక ఏదోదే మాట్లాడేస్తున్నారు. ‘సిద్ధం’ (Siddham) పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తూ యుద్ధమే అని చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం ఎంతలా జంకుతున్నారన్నది ఆయన ప్రసంగాలను కాసింత నిశితంగా పరిశీలిస్తే ప్రజలను ఒకింత బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉన్నాయని గమనించొచ్చు. ఇప్పటికే పలుమార్లు నైరాశ్యంతో మాట్లాడిన జగన్.. ఆదివారం నాడు పల్నాడు జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మరోసారి చేతులెత్తేసినట్లుగా ప్రసంగం ఉంది.

YS Jagan: జగనన్నా ఏంటిది.. ఇంకెన్ని సార్లు ఇలా.. విస్తుపోతున్న వైసీపీ శ్రేణులు!



Jagan-Siddham.jpg

అసలేం జరిగింది..?

వైఎస్ జగన్ సిద్ధం సభలో మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్కసారిగా డీలా పడిపోయినట్లుగా ప్రసంగించారు. ‘అధికారం అంటే వ్యామోహం లేదు.. పోతుందన్న భయమూ లేదు. హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ పుస్తకంలో ఉండాలి. ఈ యుద్దంలో పేదలంతా ఒక వైపు ఉంటే.. పెత్తం దారులు మరోవైపు ఉన్నారు’ అని జగన్ చెప్పుకొచ్చారు. అంటే అధికారం పోయినా పర్లేదు అనే మాట జగన్ నోట వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. అధికార వ్యామోహం, భయం లాంటి మాటలు మాట్లాడుతుంటే అంతా ఏదో తేడా కొడుతున్నట్లే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. సభలో ప్రసంగించాల్సి వచ్చిన ప్రతిసారీ జగన్ ఇలా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారనే టాక్ చాలా రోజులుగా గట్టిగానే వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటంతో అబ్బే ఇదంతా ఉత్తుత్తేనని సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయ్. జగన్ ప్రసంగంతో వైసీపీ కార్యకర్తలు, పార్టీ నేతలు ఒకింత కంగుతిన్నారట.

TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?


Siddam-Jagan-Sabha.jpg

ప్రతిపక్షాలు ఏమంటున్నాయ్..?

వైఎస్ జగన్ ప్రసంగాన్ని విన్న ప్రతిపక్ష పార్టీ నేతలు.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తుండటంతో ఏం చేయాలో.. ఎలా ముందుకెళ్లాలో తెలియకనే ఎన్నికల ముందే ఇలా జగన్ చేతులెత్తేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు దక్కవని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు.. జగన్ అక్రమంగా సంపాదించిన సొమ్ములో రూ. 700 కోట్లు ‘సిద్ధం’ సభకు, ఫ్లెక్సీల కోసం దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. 2019 ఎన్నికల్లో పాదయాత్ర అంటూ సెంటిమెంట్ ఇప్పుడేమో.. ‘గెలిపిస్తే సరే లేకుంటే నా దారి నేను చూసుకుంటాను’ అన్నట్లుగా జగన్ నోట మాటలు వస్తున్నాయని కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

TDP-JANASENA-BJP-PATH.gif

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 09:30 PM

News Hub