Share News

Pit Bull: హీరో మాదిరిగా వచ్చి పాముతో పోరాడి చిన్నారి ప్రాణాలను కాపాడిన పిట్ బుల్

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:22 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మంగళవారం ఆసక్తికరమైన ఘటన జరిగింది. నగరంలోని శివగణేష్ నగరంలోని ఓ ఇంట్లోని గార్డెన్‌లో పిల్లలు, పనిమనిషి ఆడుకుంటుండగా ఎక్కడ నుంచో ఒక కింగ్ కోబ్రా వచ్చింది. దానిని చూసి పిల్లలంతా భయపడిపోయారు. పెద్ద పెద్దగా అరుపులు, కేకలు వేశారు.

Pit Bull: హీరో మాదిరిగా వచ్చి పాముతో పోరాడి చిన్నారి ప్రాణాలను కాపాడిన పిట్ బుల్

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మంగళవారం ఆసక్తికరమైన ఘటన జరిగింది. నగరంలోని శివగణేష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గార్డెన్‌లో పిల్లలు, పనిమనిషి ఆడుకుంటుండగా ఎక్కడ నుంచో ఒక కింగ్ కోబ్రా వచ్చింది. దానిని చూసి పిల్లలంతా భయపడిపోయారు. బిగ్గరగా అరుపులు, కేకలు వేశారు.


పిల్లల అరుపులు విన్న పిట్ బుల్ డాగ్ ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చింది. అదే గార్డెన్‌లో ఒక మూలన కట్టేసినప్పటికీ తాళ్లను తెంపుకొని మరీ వచ్చింది. వెంటనే పాముతో పోరాటం మొదలుపెట్టింది. నోటితో పాముని పట్టుకొని నేలకొసి కొట్టింది. అటూ ఇటూ బలంగా ఊపింది. దాదాపు 5 నిమిషాల పోరాటం తర్వాత పాము చనిపోయింది. పాము చచ్చిపోయే దాకా దానిని పిట్‌బుల్ వదలలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


హీరోలా వచ్చి పిల్లల ప్రాణాలను కాపాడిన పిట్ బుల్ పేరు ‘జెన్నీ’ అని యజమాని పంజాబ్ సింగ్ వెల్లడించారు. పామును చంపి ఇతరుల ప్రాణాలను కాపాడడం జెన్నీకి ఇదే మొదటిసారి కాదని, ఇప్పటివరకు 8 నుంచి 10 పాములను చంపి ఉంటుందని ఆయన తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అదే ఇంట్లో మరికొన్ని కుక్కలు కూడా ఉన్నాయని, అయితే పిట్ బుల్ మాత్రం తక్షణమే స్పందించిందని ఆయన వివరించారు. ఘటన జరిగిన రోజు తాను ఇంట్లో లేనని, జెన్నీ ధైర్యం గురించి విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించిందని ఆయన చెప్పారు. ‘‘ మా ఇంట్లోకి పాము ప్రవేశిస్తే ఏదైనా జరగొచ్చు’’ అని ఆయన అన్నారు.


‘‘ నిన్న నేను ఇంట్లో లేను. నా కొడుకు, పిల్లలు ఉన్నారు. ఇలాంటి ఘటన ఎదుర్కోవడం మాకు తొలిసారి కాదు. ఎందుకంటే మా ఇల్లు పొలాలకు సమీపంలో ఉంది. వానాకాలంలో అనేక పాములు కనిపిస్తుంటాయి. ఇప్పటివరకు జెన్నీ దాదాపు 8 నుంచి 10 పాములను చంపింది. నిన్న ఇంట్లో పిల్లలు, పనిమనిషి ఆడుకుంటుండగా వారికి ఒక పాము కనిపించింది. పిల్లలు కేకలు వేయడంతో పాము పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే మా పిట్ బుల్ గమనించి దానిపై దాడి చేసింది. నాగుపాముని చంపేసింది’’ అని పంజాబ్ సింగ్ చెప్పారు.


కుక్క పట్ల తాము ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటామని పంజాబ్ సింగ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల మరింత ప్రేమను చూపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘నేటి ప్రపంచంలో జంతువులకు మనుషులు దూరమవుతున్నారు. కానీ జంతువులు మానవులకు చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నాయి. మనుషులు జంతువులపై ప్రేమ చూపాలని నేను భావిస్తాను. జనాలు పిట్ బుల్స్ గురించి తరచూ నెగిటివ్ విషయాలు మాట్లాడుతుంటారు. కానీ నేను పెంచుకుంటున్న పిట్ బుల్ ఎవరికీ హాని చేయలేదు. పాముతో 5 నిమిషాల పాటు పోరాడిన జెన్నీకి మా కృతజ్ఞతలు తెలుపుతాం. పాముని జెన్సీ చంపివేయకపోతే విషాదం జరిగివుండేది’’ అని పంజాబ్ సింగ్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

కార్ గ్యారేజ్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్

మీ మెదడుకు చిక్కుముడి.. వీటిల్లో ఏ పైప్ ద్వారా బకెట్ నిండుతోందో కనిపెట్టండి

Updated Date - Sep 25 , 2024 | 12:16 PM