Share News

Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:43 PM

క్షణాల్లో చంపెయ్యగల విషపూరిత సర్పాలు అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. ఇక, నాగుపామును చూస్తే భయంతో వణికిపోతారు. సాధారణంగా వర్షాకాలంలో పాములు వాటి స్థావరాల నుంచి జనావాసాలలోకి వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరిపోతుంటాయి. పాములు పట్టే వారికి కూడా కొన్నిసార్లు సవాళ్లు ఎదురవుతాయి.

Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..
king cobra sat on the ceiling fan

క్షణాల్లో చంపెయ్యగల విషపూరిత సర్పాలు (Snake) అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. ఇక, నాగుపాము (King Cobra)ను చూస్తే భయంతో వణికిపోతారు. సాధారణంగా వర్షాకాలంలో పాములు వాటి స్థావరాల నుంచి జనావాసాలలోకి వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరిపోతుంటాయి. పాములు పట్టే వారికి కూడా కొన్నిసార్లు సవాళ్లు ఎదురవుతాయి. అలాంటి ఎన్నో వీడియోలు (Snake Viral Video) ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో చూసే వారిని భయపడుతోంది. sarath.sms.965 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పాము ఇంట్లోకి దూరి బెడ్రూమ్‌లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ (Ceiling fan) పైకి ఎక్కి దానిని చుట్టుకుని కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఫ్యాన్ ఆన్ చేశారు. తీరా ఆ ఫ్యాన్ మీద నాగుపాము ఉన్నట్టు గమనించి వెంటనే ఆఫ్ చేశారు. మెల్లిగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్‌పై ఉన్న నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతోంది. తన నాలుకను బయటకు తీస్తూ పదే పదే బుసలు కొడుతోంది. వీడియోలో పాము బుసలు కొట్టే శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.8 కోట్ల మందికి పైగా వీక్షించారు. 3.7 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఫ్యాన్ పైన కూర్చుంటే గాలి తగలదని చెప్పండి``, ``రీల్ కోసం పామును అక్కడ కూర్చోబెట్టారా``, ``పాములు కూడా వేడికి ఉండలేకపోతున్నాయి``, ``ఆదమరిస్తే విషపూరిత నిద్ర`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్లకు, బ్రెయిన్‌కు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న మరో నలుగురిని కనిపెట్టండి..!


Picture Puzzle: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో గోల్ఫ్ బాల్‌ను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: అన్నా అంత తొందరెందుకు.. రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్‌కు ఆర్మీ మ్యాన్ ఇచ్చిన కోటింగ్ మామూలుగా లేదు!


Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2024 | 03:43 PM