Uber: రోడ్డు ప్రమాదం.. ఊబర్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన వైద్యురాలు!
ABN , Publish Date - Apr 29 , 2024 | 03:38 PM
ఇటీవల ఊబర్ క్యాబ్‌లో ప్రయాణించిన ఓ వైద్యురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా యాక్సిండెంట్ జరగడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తన గాయాల తాలూకు ఫొటోను నెట్టింట షేర్ చేసిన మహిళ ఊబర్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఊబర్ క్యాబ్‌లో ప్రయాణించిన ఓ వైద్యురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా యాక్సిండెంట్ జరగడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తన గాయాల తాలూకు ఫొటోను నెట్టింట షేర్ చేసిన మహిళ ఊబర్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల ఆమె తన ఇంటి నుంచి సమీపంలోని మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, డ్రైవర్ పొరపాటున రాంగ్ రూట్‌లో వెళ్లాడు. ఆ తరువాత అతడు వెనక్కు మళ్లేందుకు యూటర్న్ తీసుకునే క్రమంలో వెనక వాహనాలు వస్తున్నదీ లేనిదీ చూసుకోకుండా మలుపు తిప్పాడు. దీంతో యాక్సిడెంట్ జరిగింది.
Viral: వామ్మో.. ఏకంగా మెట్రోలోనే ‘సంగీత్’ కార్యక్రమం పెట్టేశారుగా..!
ఈ ప్రమంలో మహిళ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. ఓ కండరం చీలిపోయింది. ప్రమాదం కారణంగా తాను ఆ రోజు విధులకు దూరమవ్వాల్సి వచ్చిందని, పైతరగతుల ప్రిపరేషన్‌కు కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఈ దారుణ అనుభవం తరువాత తాను ఊబర్‌ను బాయ్‌కాట్ చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపింది (Delhi doctor says she is boycotting Uber after cab accident).
ఇటీవల కాలంలో అనేక మంది డ్రైవర్లు, లైసెన్సులు, అనుభవం లేకున్నా వాహనాలు తోలుతూ ప్రయాణికులను ప్రమాదాల్లోకి నెడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వారి నుంచి సామాన్యులను కాపాడేదెవరని ప్రశ్నించింది.
ఈ ఉదంతం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఊబర్ వెంటనే స్పందించింది. ఇది దారుణమైన అనుభవమని అంగీకరించిన సంస్థ, ప్రమాదం నుంచి వైద్యురాలు బయటపడినందుకు హర్షం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించామన్న సంస్థ ఫిర్యాదును ఎస్కలేట్ చేసినట్టు తెలిపింది. మరోవైపు, వైద్యురాలి పోస్టుకు గంటల వ్యవధిలోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.