Share News

Viral: గ్రీన్ కార్డుపై ఎన్నారై సీఈఓ కీలక ప్రశ్న! ఒక్క పదంతో మస్క్ రిప్లై!

ABN , Publish Date - Dec 15 , 2024 | 07:39 PM

అమెరికాలోని ఓ భారతీయ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ గ్రీన్ కార్డుపై కీలక ప్రశ్న సంధించారు. దానికి ఒక్క పదంతో ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో నడుస్తోంది.

Viral: గ్రీన్ కార్డుపై ఎన్నారై సీఈఓ కీలక ప్రశ్న! ఒక్క పదంతో మస్క్ రిప్లై!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వలసల విధానంపై విమర్శించేవారిలో ఎలాన్ మస్క్ ఒకరు. వలసల విధానానికి అనేక సంస్కరణలు చేయాలంటూ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇక మస్క్ మద్దతుతో ట్రంప్ అధ్యక్షుడిగా మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో వలసల విధానం ఎలా ఉండబోతోందో అన్న విధానంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓ భారతీయ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ గ్రీన్ కార్డుపై కీలక ప్రశ్న సంధించారు. దానికి ఒక్క పదంతో ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో నడుస్తోంది (Viral).

Gujarat: కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేక వేళ్లు నరికేసుకున్న వ్యక్తి!


ఐఐటీ మడ్రాస్‌లో ఇంజినీరింగ్ చేసిన అరవింద్ శ్రీనివాస్ ప్రస్తుతం పప్లెక్సిటీ ఏఐ అనే సంస్థకు సీఈఓగా ఉన్నారు. గతంలో ఆయన ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. అమెరికా టెక్ రంగంలో అనేక మంది ప్రముఖులు అరవింద్‌ వెనకుండి ఆర్థికంగా సాంకేతికంగా ప్రోత్సహిస్తున్నారు. అయితే, అరవింద్ తాజాగా గ్రీన్ కార్డు గురించి తన ఫాలోవర్లను ప్రశ్నించారు. ‘‘నేను గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుందామని అనుకుంటున్నాను! మరి మీరేమంటారు?’’ అని తన ఫాలోవర్లను ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మస్క్.. యస్ అంటూ ఆయనకు రిప్లై ఇచ్చారు. మస్క్ సమాధానంతో మురిసిపోయిన అరవింద్ ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ, హృదయం ఎమోజీలతో రిప్లై ఇచ్చారు.

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు


కాగా, గతంలో కూడా అరవింద్ అమెరికా వలసల విధానంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘గ్రీన్ కార్డు కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నా. కానీ ఇప్పటికీ అభించలేదు. చాలా మంది అమెరికా వలసల విధానం గురించి మాట్లాడతారు. కానీ వారికి ఈ విషయంలో కనీస అవగాహన కూడా ఉండదు’’ అని విమర్శించారు. దీనికి బదులిస్తూ ఎలాన్ మస్క్ కూడా మండిపడ్డారు. ‘‘మా వ్యవస్థ తలకిందులైపోయింది. దీంతో, క్రిమినల్స్‌ అమెరికాలోకి సులభంగా కాలుపెడుతుంటే మేధావులు న్యాయబద్ధంగా అమెరికాకు వచ్చేందుకు నానా ఇక్కట్లూ పడుతున్నారు. ఓ నోబెల్ బహుమతి గ్రహీతగా దేశంలో కాలుపెట్టడం కంటే హంతకుడిగా ప్రవేశించడం ఎందుకు సులువో!’’ అని మస్క్ రిప్లై ఇచ్చారు.

Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..

Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..

Read Latest and Viral News

Updated Date - Dec 15 , 2024 | 07:39 PM