Viral: టాప్ మార్కులొచ్చిన విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేసిన యూనివర్సిటీ! ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Apr 23 , 2024 | 05:05 PM
పిల్లుల్ని హింసించిన చరిత్ర ఉన్న విద్యార్థికి ఓ చైనా యూనివర్సిటీ ఝలకిచ్చింది. ఎంట్రన్స్‌లో టాప్ మార్కులొచ్చినా అతడికి అడ్మిషన్ నిరాకరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆ విద్యార్థికి భౌతికశాస్త్రంపై గట్టి పట్టుంది. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలో టాప్ మార్కులు కూడా వచ్చాయి. ఇక తనకు యూనివర్సిటీలో సీటు పక్కా అని అతడు అనుకున్నాడు. ఈలోపు అతడి చరిత్ర తెలుసుకున్న యూనివర్సిటీకి భారీ షాక్ తగిలింది. దీంతో, ఆ విద్యార్థిని మరో ఆలోచన లేకుండా నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేసింది. రెండో దశలో పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటూ అతడికి అడ్మిషన్ నిరాకరించింది. చైనాలో (China) ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: ఈ పిల్లాడు ఎంత పని చేశాడో చూడండి.. ఐపీఎస్ అధికారికి షాక్!
జూ అనే విద్యార్థి గణిత, భౌతికశాస్త్రాల్లో మంచిపట్టుంది. దీంతో, అతడు ఇటీవల నానింజియాంగ్‌లోని ప్రముఖ సౌతీస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశాడు. మొదటి దశలో పరీక్షలో అద్భుత మార్కులు వచ్చాయి. కానీ, అతడి గత చరిత్రను పరిశీలించిన యూనివర్సిటీ షాకైపోయింది. అప్పట్లో అతడు పిల్లుల్ని వేధించిన, చంపిన ఘటనలు (Abusing Cats) కొన్ని వెలుగు చూశాయి. ఈ హింస తాలూకు వీడియోలు నెట్టింట కూడా వైరల్ అయ్యాయి. ఒకానొక సందర్భంలో జూ ఓ పిల్లిపై బకెట్ బోర్లించి దాని తాలపై కాలుపెట్టి తొక్కి హింసించాడు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు అతడు క్షమాపణ లేఖ రాయడంతో వారు అతడిపై కేసు పెట్టకుండా కేవలం హెచ్చరికలు చేసి వదిలిపెట్టారు (Gifted Chinese student rejected by top university for past history of killing abusing cats).
యూనివర్సిటీకి ఇదంతా తెలియడంతో అతడిని ఎంట్రన్స్ రెండో దశ పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటూ ప్రకటించింది. అతడు ఎందుకు ఫెయిలయ్యాడనేది మాత్రం చెప్పలేదు. చైనా యూనివర్సిటీలు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు వారి ప్రవర్తనతో పాటు రాజకీయ అభిప్రాయాల గురించి కూడా తెలుసుకుంటాయి. నిబంధనలకు అనుగుణంగా లేని వారిని వెనక్కు పంపించేస్తాయి. అయితే, కొందరు మాత్రం జూ ప్రతిభ దృష్ట్యా అతడి తప్పులను క్షమించి, అడ్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు.
Read Latest Offbeat and Telugu News