Share News

Viral Video: దండ వేస్తుండగా ఇలా చేశాడేంటీ.. చివరి నిమిషంలో వధువుకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

ABN , Publish Date - Jul 30 , 2024 | 09:04 AM

వివాహ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు, ఇంకొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా...

Viral Video: దండ వేస్తుండగా ఇలా చేశాడేంటీ.. చివరి నిమిషంలో వధువుకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

వివాహ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు, ఇంకొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వధువు మెడలో దండ వేస్తుండగా చివరి నిముషంలో వరుడు చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వధూవరులు (bride and groom) అతిథుల సమక్షంలో దండలు (garlands) మార్చుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసింది.

Viral Video: అది రైలింజనా... లేక.. పాడుబడ్డ ఇల్లా.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..


ఆ తర్వాత వరుడి వంతు వచ్చింది. దండను చేతిలోకి తీసుకున్న వరుడు మెడలో వేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే తీరా మెడలో వేసే సమయంలో సడన్‌గా మనసు మార్చుకుని పక్కనే ఉన్న ఆమె చెల్లెలి మెడలో వేస్తాడు. దండ వేసిన తర్వాత చిన్న పిల్లల తరహాలో నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆ వెంటనే తేరుకుని వారు కూడా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.

Viral Video: కంప్యూటర్ల మధ్యలోకి దూరిన పాము.. ఏమాత్రం భయపడని ఈమె.. చివరకు ఎలా పట్టుకుందో చూడండి..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇదంతా వారు వ్యూస్ కోసం కావాలని చేసినట్లు అనిపిస్తున్నా.. వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడేంటీ... మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘అంతా బాగానే యాక్ట్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసిన సింహాలు.. కాసేపట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాయి..

Updated Date - Jul 30 , 2024 | 09:04 AM