Viral Video: రోడ్డుపైనే ప్రేమికుల సరసాలు.. ప్రేయసిని పక్కకు ఎత్తుకెళ్తుండగా.. చూస్తుండగానే ఒక్కసారిగా..
ABN , Publish Date - Jul 27 , 2024 | 09:37 PM
ప్రస్తుతం చాలా వరకూ ప్రేమికుల ప్రవర్తన ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని ప్రేమ జంటలైతే చుట్టూ జనం ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. బహిరంగంగానే..
ప్రస్తుతం చాలా వరకూ ప్రేమికుల ప్రవర్తన ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని ప్రేమ జంటలైతే చుట్టూ జనం ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. బహిరంగంగానే ముద్దులు పెట్టుకోవడం, సరసాలు ఆడడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట రోడ్డుపైనే సరసాలు మొదలెట్టింది. తర్వాత ప్రేయసిని ఎత్తుకుని పక్కకు తీసుకెళ్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డు పక్కన ఓ ప్రేమ జంట (lovers) నిలబడి ఉంటుంది. కాసేపటికి వారిద్దరూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించారు. పక్కనే వాహనాలు వెళ్తున్నా కూడా చాలా సేపు వారు అలా కౌగిలించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు.
Viral Video: ఎరను చూసి దగ్గరికొచ్చిన మొసలి.. సడన్‌గా వెనక్కు లాక్కోవడంతో.. చివరకు తిక్కరేగి..
అయితే చాలా సేపటి తర్వాత వాహనదారులు గమనిస్తున్నారే కారణంతో అతను ఒక్కసారిగా తన ప్రేయసిని పైకి ఎత్తుకున్నాడు. అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లానే ఉద్దేశంతో వేగంగా పరుగెత్తాడు. అయితే వర్షం పడి రోడ్డు మొత్తం బురదమయంగా ఉండడంతో కొద్ది దూరం వెళ్లగానే (man fell down while picking up his girlfriend) అదుపుతప్పి ధబేల్‌మని కిందపడ్డాడు. తర్వాత ఇద్దరూ కుయ్యో.. మొర్రో.. అనుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు.
ఈ ఘటనను మొత్తం కారులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రేమికుల పిచ్చి రోజురోజకూ పీక్స్‌కు వెళ్తోంది’’.. అంటూ కొందరు, ‘‘చివరకు బాగానే జరిగింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: రోడ్డు మధ్యలో మహిళ వింత నిర్వాకం.. తాంత్రిక పూజలు చేస్తూ.. అంతా చూస్తుండగానే..