Hyderabad: సమతుల ఆహారం.. థాలీ
ABN , Publish Date - Dec 08 , 2024 | 01:32 PM
దేశంలో విభిన్న భాషలు, సంస్కృతులు లాగానే ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల వంటకాలు, రుచులూ కనిపిస్తుంటాయి. ఉత్తరాది ‘థాలీ’గా చెప్పే మన ‘బుట్ట భోజనం’ పోషకాల గనిగా చెప్పకతప్పదు అని అంటున్నారు పోషకాహార నిపుణులు.
- పోషకాలు అధికం
- రోగనిరోధక శక్తి మెరుగుపరచడంలో కీలకపాత్ర
హైదరాబాద్ సిటీ: దేశంలో విభిన్న భాషలు, సంస్కృతులు లాగానే ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల వంటకాలు, రుచులూ కనిపిస్తుంటాయి. ఉత్తరాది ‘థాలీ’గా చెప్పే మన ‘బుట్ట భోజనం’ పోషకాల గనిగా చెప్పకతప్పదు అని అంటున్నారు పోషకాహార నిపుణులు. పలువురు బాలీవుడ్ తారలకు పోషకాహార సేవలను అందిస్తున్న పోషకాహార నిపుణురాలు పూజా మఖీజా.. భారతీయ థాలీని మించిన సమతుల ఆహారం ప్రపంచంలో లేదంటున్నారు. శరీరానికి ఒక రోజులో అవసరమైన పోషకాలలో అధికశాతం అందిస్తుందని చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Ambulance: కంగారెత్తించిన కుయ్ కుయ్!
థాలీతో క్రమ పద్ధతిలో పోషకాలను తీసుకోవడం సాధ్యమవుతుందంటున్నారు చెఫ్‌లు. శరీరానికి సత్తువ ఇచ్చే పదార్థాలన్నీ ఒకేసారి ఆరగించడం అన్ని వేళలా సాధ్యం కాదు అనే భావనను పూర్తిగా మార్చివేసిన నేపథ్యమే థాలీ అని చెబుతున్నారు చెఫ్ రాము(Chef Ramu). ఉత్తర భారత, గుజరాతీ, రాజస్తానీ.. థాలీలు ఎంతగా ప్రసిద్ధి చెందాయో దక్షిణ భారత థాలీలు కూడా ఇటీవలి కాలంలో అంతే ప్రసిద్ధి చెందాయంటున్నారాయన. భోజన ప్రేమికులకు సకల పోషకాలనందిస్తున్న వంటకం థాలీయే అని చెబుతున్నారు చెఫ్ సృజన్.
ఆరోగ్యం..
థాలీని మించింది లేదంటున్నారు పోషకాహార నిపుణురాలు దీప్తి. ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి లభిస్తాయన్నారు. సాధారణంగా థాలీలో కనిపించే పప్పులు(కందిపప్పు, పెసరపప్పు, రజ్మా)లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిద్వారా ప్రొటీన్, అమినో యాసిడ్స్ లభిస్తాయి. రైస్‌లో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. మన థాలీలో వాడే మసాలాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, లవంగాలు, జీలకర్ర, మిరియాలు వంటి హెర్బ్స్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు కలిగి ఉంటాయి. తద్వారా రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. పెరుగు, మజ్జిగ మనకు అవసరమైన కాల్షియం, ప్రొటీన్ అందించడంతోపాటు జీర్ణక్రియలో తోడ్పడే ప్రో బయాటిక్స్‌గా తోడ్పడతాయి. పన్నీర్ లాంటి వాటిలో బి కాంప్లెక్స్ విటమిన్స్‌తో పాటు కె-విటమిన్స్ లాంటివి లభిస్తాయి అని చెప్పారు.
షడ్రుచులు
ఉగాది పచ్చడిలో మాత్రమే కాదు, థాలీలోనూ షడ్రుచులు ఉంటాయంటున్నారు చెఫ్‌లు. స్థాలిక అనే సంస్కృత పదం నుంచి థాలీ పుట్టిందని సృజన్ చెబుతూ.. సాధారణ థాలీలో రోటీ లేదంటే నాన్, చపాతీ లేదా పూరీ, కొద్దిగా అన్నం, చట్నీ, పచ్చడి, సలాడ్, పాపడ్, కూర, వేపుడు, సాంబార్, రసం, పెరుగు లాంటివి ఉంటాయి. ప్రాంతాలను బట్టి వంటకాలు మారవచ్చు.
ఉదాహరణకు కేరళ ఆహారంలో పచ్చడి, టమోటా రసం, కూరగాయలతో సాంబారు, అవైల్, పులిసెర్రీ లాంటివి ఉంటే, తెలుగు బుట్ట భోజనంలో పప్పు, వేపుడు, ఇగురు కూర, పులుసు, పప్పుచారు, రసం, పులిహోర, అన్నం, గారె, పచ్చళ్లు, పొడులు, పెరుగు, పాయసం వంటివి ఉంటాయన్నారు. నగరంలో సాధారణంగా కనిపించే థాలీలో స్వీటు, అన్నం, వేపుడు, సాంబారు లేదంటే పప్పు చారు, రసం, కూర, పప్పు, అప్పడంతో పాటు నాలుగు రకాల పచ్చళ్లు, అప్పడాలు, మజ్జిగలో నానబెట్టిన మిరపకాయలు ఉంటాయి. దక్షిణాది థాలీలో సాధారణంగా 9-12 రకాల వంటకాలను, స్పెషల్ థాలీలో 14-16 వంటకాలను అందిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Breaking News: మంచు ఫ్యామిలీలో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ మనోజ్
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈవార్తను కూడా చదవండి: JP Nadda: మభ్యపెట్టి.. అధికారంలోకి
ఈవార్తను కూడా చదవండి: Shankar journalist: తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకర పోస్టులు
Read Latest Telangana News and National News