Share News

Viral: ఇతడు నాగు పామును ఎలా బంధించాడో చూడండి.. ఈ ట్రిక్ ఎక్కడా చూసుండరు!

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:09 PM

ఓ వ్యక్తి నాగుపామును డబ్బాలో బంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: ఇతడు నాగు పామును ఎలా బంధించాడో చూడండి.. ఈ ట్రిక్ ఎక్కడా చూసుండరు!
Man Catches Snake In a Jar

ఇంటర్నెట్ డెస్క్: పాములు పట్టడమంటేనే ఓ సాహస చర్య. ఎంతో నైపుణ్యంతో ఒడుపుగా వ్యవహరిస్తేనే పాములను ఎటువంటి ప్రమాదం లేకుండా పట్టొచ్చు. దీనికి ఎంతో అనుభవం అవసరం. ఇక జనాలు సాధారణంగా పాములను వెదురుతో అల్లిన బుట్టలు, లేదా గోనె సంచుల్లో బంధిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి చిన్న ప్లాస్టిక్ డబ్బాతో పామును పట్టిన తీరు నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు.

Indian Railways: గూగుల్‌నే నమ్ముకుందేమో కానీ.. రైల్వేకు ఊహించని షాక్!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి చాలా నైపుణ్యంతో పామును ఓ డబ్బాలో బంధించాడు. తొలుత ఓ చేత్తో డబ్బా పట్టుకుని పామును సమీపించాడు. అది వెంటనే బుసకొట్టడం ప్రారంభించింది. రెండుసార్లు కాటేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ దాన్నుంచి ఒడుపుగా తప్పించుకున్న అతడు మెల్లగా డబ్బాను పాము తలవద్దకు తెచ్చాడు. పాము డబ్బాలోపలికి దూరేలా జాగ్రత్తగా ప్రయత్నించాడు.

తొలుత రెండు మూడు సార్లు పాము డబ్బాలోకి వెళ్లకుండా అటూ ఇటూ తిరిగింది. బుసకొడుతూ ఆ వ్యక్తిని బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ ఆ వ్యక్తి మాత్రం పట్టువిడవకుండా ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము మెల్లగా తల డబ్బాలోపలికి పెట్టింది. ఆ తరువాత అతడు పాము మిగతాభాన్ని కూడా మెల్లమెల్లగా డబ్బాలోకి తోసేశాడు. చివరకు డబ్బాను పైకెత్తి మూత పెట్టి పామును విజయవంతంగా బంధించాడు (Man traps snakes in a jar Effortlessely).

Viral: రైల్లో తన చెల్లికి ఎదురైన అనుభవానికి అన్నకు భారీ షాక్!


నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ దృశ్యాల్ని చూసిన చుట్టుపక్కల వారు అతడు పామును బంధించగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున చప్పట్లు చరిచారు. పామును ఇంత సింపుల్‌గా అతడు బంధించడం చూసి జనాలు షాకైపోతున్నారు. అనుభవజ్ఞలు కూడా ఇబ్బంది పడే పనిని అతడు చాలా సునాయాసంగా చేసేశాడంటూ కితాబిచ్చారు. ఇతనికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని కొందరు, హ్యా్ట్సాఫ్ చెప్పాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్‌ల మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 07:15 PM