Viral News: పాకిస్థాన్‌లోని ధనిక బిచ్చగాడు ఇతనే.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా
ABN , Publish Date - Jun 17 , 2024 | 08:10 AM
పాకిస్తాన్ ప్రభుత్వం రుణాలు చెల్లించడానికి విదేశాల నుంచి డబ్బులు తీసుకోవాల్సిన దుస్థితి ఉంది. అయితే పాక్‌లోని ఓ బిచ్చగాడికి మాత్రం ధరల పెరుగుదల సమస్యే కాకుండా పోయింది. దాయాది దేశంలో అతనే అత్యంత సంపన్న బిచ్చగాడు(Richest Begger) కావడం ఇందుకు కారణం.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారుతోంది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఆ దేశ ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు నానాతంటాలు పడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం రుణాలు చెల్లించడానికి విదేశాల నుంచి డబ్బులు తీసుకోవాల్సిన దుస్థితి ఉంది.
అయితే పాక్‌లోని ఓ బిచ్చగాడికి మాత్రం ధరల పెరుగుదల సమస్యే కాకుండా పోయింది. దాయాది దేశంలో అతనే అత్యంత సంపన్న బిచ్చగాడు(Richest Begger) కావడం ఇందుకు కారణం. పాకిస్తాన్‌లోని ముల్తాన్ నగరంలో పంజాబ్ ప్రావిన్స్‌లో షౌకత్ అనే బిచ్చగాడు నివసిస్తున్నాడు.
2021 అక్టోబర్‌లో అతని బ్యాంక్ అకౌంట్లో 1.7 మిలియన్ డాలర్లు(14-15 కోట్లు) ఉన్నాయి. అతను రోజుకి రూ.వెయ్యికి పైగా అడ్డుక్కుని సంపాదిస్తున్నాడు. అతను తన పిల్లలకు రూ.కోటి బీమా చేయించాడు. వారు ముల్తాన్ సిటీలోని సంపన్నులు చదువుకునే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇలా పాకిస్థాన్‌లో రిచెస్ట్ బిచ్చగాడిలా మారి వార్తలో నిలిచాడు.