Lizards : బల్లుల్ని ఇంటి నుంచి తరిమేసే ఇండోర్ మొక్కలు..!
ABN , Publish Date - Feb 16 , 2024 | 11:10 AM
ఇళ్ళకు అందాన్నిచ్చే మొక్కలుగా కూడా ఈ పూలు ప్రత్యేకమే. అలాంటి ఈ బంతి మొక్కలకి ప్రత్యేకమైన సువాసన ఉంటుంది.
బల్లులు ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఇవి ప్రతి మూలల్లోనూ ఉండి, ప్రమాదంగా మారుతాయి. వీటితో అంతా ఇంతా బెడద కాదు. ఏ ఆహారపదార్థాలలో పడినా కూడా ప్రాణాంతకమే. అందుకే వీటిని సున్నితంగా వదిలించుకోవాలంటే మొక్కల వల్ల వీలవుతుందట. వీటిలో ముఖ్యంగా ఘాటైన సువాసన కలిగిన మొక్కలతో ఇది సాధ్యం అవుతుంది. ఆహారంలో ఉపయోగించే పుదీనా తెలుసుగా.. దాని ఘాటైన సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది బల్లులను రానీయకుండా చేస్తుంది. ఇంటి ఆవరణలో కాస్త కాంతి బావుండే చోట ఇసుకలో నాటితే ఇట్టే నాటుకుంటుంది. పుదీనా ఆహార పదార్థాలలోనే కాదు. ఈ వాసనతో ఇంట్లో చేరే బల్లులను కూడా తరిమేయగలదు.
తులసి..
పూజలకు పవిత్రంగా భావించే తలసి ఔషధంగా కూడా ఆరోగ్యకరమైన మొక్కగా భావిస్తాం. తులసికి ప్రత్యేకమైన ఘాటైన వాసన ఉంది. ఇది బల్లులను తిప్పికొట్టే శక్తి కూడా ఉంది. దీనిని ఇంటి ఆవరణలో ఉంచినట్లయితే ఆ సువాసనకు బల్లులు దరిచేరవు.
లావెండర్..
లావెండర్ బలమైన వాసనతో సెంటుగానే కాదు.. ఇంటి ఆవరణలో సువాసనలు వెదజల్లో మొక్కగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇది బల్లలను తరిమేయగలదు. ఇంటి మూలల్లో ఈ కొమ్మలను ఉంచినా, లేదా ఈ మొక్కను ఉంచినా ఆ దరిదాపుల్లోకి బల్లులు చేరవు.
బంతి..
బంతి పూలు అలంకరణలోనూ, అందానికి మంచి పూలు. వీటిని మేరిగోల్డ్స్ అంటారు. తెగుళ్ళను తిప్పికొట్టడానికి తోటలలో వీటిని ప్రత్యేకంగా పెంచుతారు. ఇళ్ళకు అందాన్నిచ్చే మొక్కలుగా కూడా ఈ పూలు ప్రత్యేకమే. అలాంటి ఈ బంతి మొక్కలకి ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. వాటిని ఇంటి మూలల్లో ఉంచడం వల్ల బల్లులు దరిచేరవు.
రోజ్మేరీ..
రోజ్మేరీ బల్లులను నిరోధించే బలమైన సువాసనలు కలది. ఇది ఆరోగ్యపరంగా కూడా వాడుతూ ఉంటాం. దీని ఘాటైన వాసనకు బల్లులు ఇంటి ఆవరణను వదిలిపోతాయి.
సిట్రస్ మొక్కలు..
నిమ్మ మొక్కలు, నారింజ ఇలా సిట్రస్ మొక్కలు సువాసనలకు బల్లులు పారిపోతాయి.
ఇది కూడా చదవండి: ఈ పక్షులు రాత్రిపూట పాటలు పాడుకుంటాయ్..!
యూకలిప్టస్..
యూకలిప్టస్ మొక్కలకు కూడా ప్రత్యేకమైన వాసన ఉంటుంది. వీటి వాసనకు బల్లులు పారిపోతాయి.
క్యాట్నిప్..
క్యాట్నిప్ లో నెపెటలాక్టోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కీటకాలను తిప్పికొట్టడానికి పనిచేస్తుంది. ఇది బల్లులను కూడా అడ్డుకుంటుంది.
జెరేనియం..
జెరేనియంలు మంచి వాసనను కలిగి ఉంటాయి. ఇవి బల్లులను అరికట్టవచ్చు.