Share News

Chatgpt false accusations: నీకు ముగ్గురు పిల్లలు.. వారిలో ఇద్దరిని చంపేశావు.. చాట్‌జీపీటీ రిప్లైకి యూజర్ షాక్

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:47 PM

నువ్వో హంతకుడివి అంటూ చాట్‌జీపీటీ ఆరోపించడంతో తట్టుకోలేకపోయిన నార్వే వ్యక్తి న్యాయపోరాటానికి దిగాడు. ఓపెన్‌ఐ‌పై నార్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Chatgpt false accusations: నీకు ముగ్గురు పిల్లలు.. వారిలో ఇద్దరిని చంపేశావు.. చాట్‌జీపీటీ రిప్లైకి యూజర్ షాక్
Chatgpt false accusations Hallucinations

ఇంటర్నెట్ డెస్క్: కడుపున పుట్టిన పిల్లల్నే హత్య చేశావంటూ చాట్‌జీపీటీ ఆరోపించడంతో షాక్‌ గురైన ఓ యూజర్ చివరకు న్యాయపోరాటం ప్రారంభించాడు. ఈ చాట్‌బాట్ మాతృసంస్థపై ఫిర్యాదు చేశారు. నార్వేలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, హోల్మన్ అనే వ్యక్తి గతేడాది చాట్‌జీపీటీకి ఓ ప్రశ్న వేశాడు. తన గురించి చెప్పమని అన్నాడు. ఆ తరువాత చాట్‌జీపీటీ రెచ్చిపోయింది. ఆ యూజర్‌కు ముగ్గురు పిల్లల్ని, వారిలో ఇద్దరిని ఇప్పటికే పొట్టనపెట్టుకున్నాడని అన్నది. అంతేకాకుండా, మరో బిడ్డపై హత్యాయత్నం చేశాడని, 21 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిందని చెప్పింది. తన గురించి చాట్‌జీపీటీ మరీ ఇలా చెప్పడం విని అతడు షాకైపోయాడు.

‘‘దీన్ని ఎవరైనా చూస్తే ఏదో అనుమానాస్పదంగా ఉందని కచ్చితంగా అనుకుంటారు. ఇది నిజమని భావిస్తారు. ఈ విషయం తలుచుకుంటేనే భయమేస్తోంది’’ అని అన్నారు.


Also Read: భారత సంతతి టెకీ చెప్పిన ఇంటర్వ్యూ టిప్.. లైక్ కొట్టిన గూగుల్!

హోల్మన్ తరుపున డిజిటల్ హక్కుల సంస్థ న్యోబ్.. నార్వీజియన్ డాటా ప్రొటక్షన్ అథారిటీలో ఫిర్యాదు చేసింది. హోల్మన్‌కు అసలు ఎటువంటి నేర చరిత్ర లేదని తెలిపింది. ఇలా తప్పుల తడక సమాచారం ఇచ్చి చివర్లో డిస్‌క్లెయిమర్‌తో బాధ్యత వదిలించుకోవడం కుదరదని స్పష్టం చేసింది. చాట్‌జీపీటీ రెస్పాన్స్.. వ్యక్తిగత సమాచార కచ్చితత్వానికి సంబంధించిన ఐరోపా చట్టాలను ఉల్లంఘించిందని స్పష్టం చేసింది.


Also Read:కొత్తగా ఏదైనా చేద్దామనుకుని దెబ్బైపోయిన మహిళ.. ఇంటిపై నుంచి దూకితే..

నిపుణులు చెప్పేదాని ప్రకారం, చాట్‌బాట్‌లు ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని హాల్యూసినేషన్స్ అని అంటారు. అంటే..భ్రమకు లోనుకావడం అని అర్థం. ఏఐ కూడా ఒక్కోసారి తప్పుడు సమాచారాన్ని సరైనదిగా భ్రమపడి యూజర్లకు అదే సమాచారాన్ని ఇస్తుంది. గతంలో గూగుల్ చాట్‌బాట్‌ జెమినీపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. రోజుకు ఒక గులకరాయి తినాలి, పిజ్జాపై గమ్ము రాయాలని చెప్పి అప్పట్లో జెమినీ విమర్శల పాలైంది. ఇక తాజా ఉదంతం కారణంగా చాట్‌జీపీటీ హాల్యూసినేషన్స్‌పై కూడా చర్చ మొదలైంది.

Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు

Read Latest and Viral News

Updated Date - Mar 22 , 2025 | 03:47 PM