Share News

భారత సంతతి టెకీ చెప్పిన ఇంటర్వ్యూ టిప్.. లైక్ కొట్టిన గూగుల్!

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:03 PM

ఇంటర్వ్యూల్లో ఎలా నెగ్గుకురావాలో చెబుతూ ఓ భారత సంతతి టెకీ పంచుకున్న టిప్స్ గూగుల్‌కు కూడా మెప్పించాయి. దీంతో, అతడి సూచనలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

భారత సంతతి టెకీ చెప్పిన ఇంటర్వ్యూ టిప్.. లైక్ కొట్టిన గూగుల్!
Tips for Cracking Coding Interviews

ఇంటర్నెట్: సాఫ్ట్‌వేర్ జాబ్ ఇంటర్వ్యూల్లో ఎలా నెగ్గుకు రావాలో చెబుతూ ఓ భారత సంతతి టెకీ షేర్ చేసిన టిప్స్ వైరల్‌గా మారాయి. గూగుల్‌‌కు కూడా ఈ సూచన మెచ్చి లైక్ కొట్టడంతో టెకీ సర్‌‌ప్రైజ్ అయ్యారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

సియాటెల్‌లో ఉంటున్న భారత సంతతి ఇంజినీర్ సాహిల్ గాబా ఈ టిప్ షేర్ చేశారు. తాను నాలుగేళ్లుగా గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంటర్యూల్లో నెగ్గుకు వచ్చేందుకు కావాల్సిన టిప్స్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నుంచే తెలుసుకోవచ్చని అన్నారు.

‘‘జాబ్ కొట్టేందుకు కావాల్సిన టిప్స్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నుంచే తెలుసుకోవచ్చు. చాలా మంది ఇంటర్వ్యూ చేసే వాళ్లను జడ్జిలుగా భావిస్తుంటారు. తమను ఫెయిల్ చేయడానికే వారు ఉన్నారని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇంటర్వ్యూలో ఎలా నెగ్గాలో వారి నుంచే తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యువర్‌కు మించిన రిసోర్స్ మరొకటి ఉండదు’’ అని సాహిల్ వివరించారు. ఇంటర్వ్యూల్లో నేరుగా కోడింగ్‌కు దిగేముందు ఇంటర్వ్యువర్‌ను అడిగి సందేహాలు తీర్చుకోవచ్చని చెప్పారు.


Woman fall from Terrace: కొత్తగా ఏదైనా చేద్దామనుకుని దెబ్బైపోయిన మహిళ.. ఇంటిపై నుంచి దూకితే..

సరైన విధానంలో ప్రశ్నలు అడిగితే ఇంటర్వ్యువర్ బోలెడన్ని పరోక్ష సూచనలు చేసేస్తారని సాహిల్ అన్నారు. ‘మీ మనసులో ఉన్నది బయటకు అంటే దాన్ని ఇంటర్వ్యువర్ గుర్తించి నిన్ను సరైన మార్గంలో నడిపించగలరు. అవతలి వారికి మార్గనిర్దేశకత్వం చేయడంలో ప్రతి వారికీ ఓ సంతృప్తి దొరుకుతుంది. ఏదైనా చిక్కుముడి ఎదురైనప్పుడు కంగారు పడొద్దు. నేరుగా పరిష్కారాలు అడగకుండా.. ‘‘ఈ విధానం బదులు రెండో పద్ధతి బాగుంటుదని అనుకుంటున్నా..’ అని అంటే ఇంటర్వ్యూవర్లు కూడా సాయపడే అవకాశం ఉంది’’ అని చెప్పుకొచ్చారు. అమెజాన్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ఎదురైన సమస్య నుంచి ఇలాంటి పద్ధతిలోనే బయటపడ్డానని అన్నారు.


Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు

‘‘ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు కూడా భావోద్వేగాలు ఉన్న మనుషులే అన్న విషయం మర్చిపోకూడదు. కేవలం మీ నైపుణ్యాలను ముదింపు వేయడమే కాకుండా మీతో సరదా సంభాషణ నెరపేందుకు కూడా వాళ్లు ట్రై చేస్తుంటారు’’ అని అన్నారు. దీనిపై గూగుల్ కూడా స్పందించింది. ఇంత మంచి టిప్స్ షేర్ చేసినందుకు థ్యాంక్స్ అని వ్యాఖ్యానించింది. దీంతో, ఈ ఉదంతం గత కొద్ది రోజులుగా తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Mar 22 , 2025 | 04:47 PM