Viral Video: ‘టైగర్’ పుట్టిన రోజు.. సరిత ఏం చేసిందంటే..?
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:11 PM
ఈ రోజుల్లో బంగారం ధర మామూలుగా లేదు. పెళ్లి, పేరంటానికో బంగారం కొనేందుకు ఇంట్లోని పెద్దలు ఒకటికి రెండు సార్లు మరీ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాతే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఈ రోజుల్లో బంగారం ధర మామూలుగా లేదు. పెళ్లి, పేరంటానికో బంగారం కొనేందుకు ఇంట్లోని పెద్దలు ఒకటికి రెండు సార్లు మరీ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాతే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాసు బంగారం ధర రూ.50 వేలకుపైనే ఉంది. అలాంటి వేళ ముంబైలోని ఓ మహిళ రూ.2.5 లక్షల పెట్టి 35 గ్రాముల బంగారం గొలుసు కొనుగోలు చేసింది. అయితే ఆ గొలుసు.. ఆమె తన సొంతానికో.. భర్త కోసమో.. లేదా ఆమె పిల్లల కోసమో అయితే ఎవరు అంతగా ఆశ్చర్య పడరు.
కానీ తన పెంపుడు కుక్క ‘టైగర్’ కోసం ఈ గొలుసును ఆమె కొనుగోలు చేసింది. తన ట్రైగర్ జన్మదినం సందర్భంగా ఈ గొలుసును మెడలో వేసింది. అందుకు సంబంధించిన వీడియోను.. బంగారం షాప్ యజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు కామెంట్ సైతం చేశాడు. మానవులు, జంతువుల మధ్యనున్న అందమైన బంధాన్ని ఇది తెలియజేస్తుందన్నారు. తన టైగర్ జన్మదిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని యజమానురాలు సరితా సల్దాన్హా భావించారు.
Also Read: Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
ఆ క్రమంలో ఆమె.. తమ షాప్‌కు వచ్చి ఈ బంగారం గొలుసు కొనుగోలు చేశారని షాపు యజమాని వివరించారు. చాలా సున్నితంగా ఈ గొలుసును తయారు చేశామని తెలిపారు. సూర్య కిరణాలు పడినప్పుడు ఈ గొలుసు తళతళ మెరుస్తుందన్నారు. ఇక ఈ గొలుసును మెడలో ఆమె వేసినప్పుడు.. ఆ కుక్క వ్యవహరించిన తీరును ఈ సందర్బంగా షాపు యజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోదాహరణగా వివరించారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ముంబై మహిళ సరిత చేసిన ఈ పనిని ముద్దుగా ఉందని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్ అయితే.. కుక్కకు బంగారం గొలుసు కొనుగోలు చేయడం ద్వారా తన డాబును ఆమె ప్రదర్శిస్తుందన్నారని చురకలంటించారు.
Also Read: Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు
ఇక బంగారు గొలుసుతో ఉన్న కుక్కను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఆలోచన మాత్రం ఆమెకు వచ్చినట్లుగా లేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇంకొకరయితే కుక్కకు ఇలా బంగారం గొలుసు కొనే బదులు.. నిరుపేదలకు ఆహార పదార్ధాలు ఏమైనా కొనిస్తే బావుండేదని టైగర్ యజమానురాలుకు సూచించారు.
మరికొందరు అయితే.. సరిత చేసిన ఈ పనికి ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంచి పని చేశావంటూ ఆమెను ప్రశంసించారు. ఇంకొందరైయితే టైగర్‌ను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఎందుకంటే.. చెడ్డ వ్యక్తుల బారీ నుంచి మిమ్మల్ని టైగర్ రక్షిస్తుందని సరితకు నెటిజన్లు సూచించారు.
Read Latest News And National News