Narayana Murthy: వారానికి 70 పని గంటల సూచనపై విమర్శలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Jan 05 , 2024 | 03:55 PM
వారానికి 70 గంటలు పని చేయాలన్న తన సూచనపై వివాదం రేగిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తొలిసారిగా స్పందించారు. తన సూచనను సమర్థించుకున్న నారాయణ మూర్తి..ఇది యువత భుజాలపై ఉన్న బాధ్యతని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: వారానికి 70 గంటలు (70 work hour week) పని చేయాలన్న తన సూచనపై వివాదం రేగిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) తాజాగా స్పందించారు. తన సూచనను సమర్థించుకున్న నారాయణ మూర్తి..ఇది యువత భుజాలపై ఉన్న బాధ్యతని తేల్చి చెప్పారు. తాజాగా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి తన సతీమణి సుధామూర్తితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వారానికి 70 గంటల పని’పై సవివరంగా మాట్లాడారు.
హైదరాబాద్‌కు వస్తే వీటిని ఒక్కసారైనా ట్రై చేయండి!
వావ్.. రోజూ గోరువెచ్చని నీరు తాగితే ఇన్ని లాభాలా!
చెమటోడ్చి కష్టపడుతున్న రైతులు, కార్మికుల గురించి ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. చదువుపై ప్రభుత్వ రాయతీలతో ఉన్నతవిద్యావంతులైన వారు తమకంటే దిగువన ఉన్న సాటి పౌరుల కోసం కష్టించి పనిచేయాలని తేల్చి చెప్పారు. చైనా లాంటి ప్రపంచ ఆర్థిక శక్తులతో పోటీపడేందుకు ఈ నిబద్ధత అవసరమని స్పష్టం చేశారు.
నడుం నొప్పి వదలట్లేదా? ఇలా చేస్తే గ్యారెంటీగా రిలీఫ్!
‘‘ఈ దేశంలో ఎందరో రైతులు చెమటోడ్చి కష్టపడుతున్నారు. కాబట్టి, మనందరం కష్టించి పనిచేయాలి. ప్రభుత్వ రాయతీల ఆధారిత చదువుతో విద్యావంతులైన వారు తమకంటే దిగువన ఉన్న వారి కోసం తీవ్రంగా శ్రమించాలి’’ అని పేర్కొన్నారు. తను డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చానని సుధా మూర్తి కూడా తెలిపారు. తన తండ్రి రోజుకు 70 గంటల పాటు పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. తానూ ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ రాత్రి 9 గంటలకు తిరిగొచ్చే వాడినని నారాయణ మూర్తి తెలిపారు.
మీరు అన్నం తినకూడదా? అయితే ఇలా చేయండి!
ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో మూర్తి వారానికి 85-90 గంటలకు పైగా పనిచేసేవారు. 1981లో సంస్థ ఏర్పాటైన నాటి నుంచి 1994 వరకూ ఇన్ఫోసిస్‌లో వారానికి ఆరు పనిదినాలు ఉండేవి. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి తన నిరంతర శ్రమే కారణమని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
Canada: భారతీయుల్లో కెనడాపై తగ్గుతున్న ఆసక్తి?